అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అల్లు అర్జున్ చాలా సినిమాలకి దేవి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. కొన్ని సినిమాలు సినిమాగా హిట్ కాలేకపోయినా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

 


ఆర్య, ఆర్య ౨ సినిమాల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడవ చిత్రమిది. ఆర్య సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. దేవి పాటలు, అల్లు అర్జున్ డాన్సులు,, సుక్కూ స్టైల్ కి దిమ్మ తిరిగిపోయింది. ఆర్య ౨ కొన్ని కారణాల వల్ల అంతగా ఆడకపోయినప్పటికీ పాటలు మాత్రం బ్లాక్ బస్టరే.

 

ఈ రెండు సినిమాలే కాదు, సుకుమార్ చేసే ప్రతీ సినిమా పాటలు కూడా బాగా హిట్ అవుతుంటాయి, మొదటి సినిమా నుండి మొన్నటి రంగస్థలం వరకు దేవిశ్రీనే సుకుమార్ సినిమాలకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ప్రస్తుతం దేవి మీద బాగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. బన్నీ అలవైకుంఠపురములో పాటలు ఎంతలా సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. థమన్ స్వరపరిచిన ఈ పాటలకి అనూహ్య స్పందన వచ్చింది.

 

పాటల ద్వారానే సినిమాకి అంతలా ప్రమోషన్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్ లో ఈ పాటలకి బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో బన్నీ థమన్ కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇప్పుడు దేవి కూడా ఆ రేంజ్ లో పాటలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అల వైకుంఠపురములో తర్వాత పుష్ప సినిమా మీద అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో దేవీకీ ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఇప్పటి వరకు ఇచ్చిన ట్యూన్లపై దేవిశ్రీ మళ్లీ కొత్తగా పనిచేస్తున్నాడట. అల్లు అర్జున్ ని మెప్పించే క్రమంలో మరింత హార్డ్ వర్క్ చేస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: