మంగ్లీ... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం లేని పేరు. మంగ్లీ పూర్తి పేరు మంగ్లీ చిన్మయి. ఈవిడ 1994వ సంవత్సరం జూన్ 10న జన్మించింది. మంగ్లీ పాడిన పాటలు యూట్యూబ్ ఛానల్ లో ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఆమె పాడే పాట, తన వాయిస్ ఇలా అన్ని రకాలుగా ఒక్క గ్రామీణ ప్రాంత ప్రజలే కాకుండా పట్టణ, సిటీలోని తేడా లేకుండా మంగ్లీ ఇష్టపడని వారుండరంటే నమ్మండి.

 

ఇక అసలు విషయానికి వస్తే... మంగ్లీ ఇప్పుడు యూట్యూబ్ లో ఒక రికార్డు సృష్టించింది. అదేమిటంటే తెలుగులో యూట్యూబ్ తన ఛానెల్ లో మంగ్లీ పాడిన పాటలు మూడో స్థానాన్ని ఆక్రమించింది. అలాగే భారతదేశం మొత్తం మీద 65 స్థానాన్ని సంపాదించుకోగలిగింది. దీన్ని బట్టి చూడొచ్చు రోజుకి యూట్యూబ్ లో ఎన్ని వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి అది ఎంతమంది చూస్తుంటారు అందులో ఈ స్థానాన్ని సంపాదించాలంటే మంగ్లీ పాడిన పాటలు ఎంత ప్రాచుర్యం చెందాయో. ఇటీవల అల వైకుంఠపురం లో సినిమాలో పాడిన రాములో రాముల పాట ఎంత పెద్ద హిట్ అయిందో మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఈ విషయాన్ని తెలుసుకున్న మంగళి మాట్లాడుతూ ఈ విషయం నేను వినగానే చాలా ఆనందపడ్డాను అని అలాగే ఆశ్చర్య పోయాను అని కూడా చెప్పుక వచ్చింది. ఒక భాషకు సంబంధించి ఇంత పెద్ద విజయాన్ని సాధించి నందుకు ఎంతో చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. నేను స్వతహాగా, ఎవరి అండదండలు లేకుండా సినీ ఇండస్ట్రీలో ఇంత ఎత్తుకు ఎదగడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. 7 - 8 సంవత్సరాల కింద నేను ఈ స్థాయికి ఎదుగుతానని తాను అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె పాడిన పాటలలో బోనాల పాట ఎంతో ప్రాముఖ్యత చెందింది.


ఇక అక్కడితో మొదలైన మంగ్లీ ప్రస్థానం తరువాత ఏ పెద్ద పండుగ వచ్చిన మంగ్లీ పాట లేకుండా ఉండదు. ఈ పాటలన్నీ పూర్తి పల్లెటూరి వాతావరణం సంతరించుకోవడంతో ఆమె పాటల్ని అందరూ ఆదరిస్తూ వస్తున్నారు. మంగ్లీ చెబుతూ నేను ఇంకా మీ కోసం వివిధ సినిమాల్లో పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుపుతోంది. ఇక చివరగా మంగ్లీ చెబుతూ "మన తెలుగు పాటలు అదిలాబాదు నుండి అమెరికా వరకు పాకి నందుకు చాలా సంతోషంగా ఉంది" అని మంగ్లీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: