నటులకు భాషా బేధం ఉండదనేది ఓ మాట. ఇది ముమ్మాటికీ నిజం. కళాకారులకు వారి ప్రతిభే గీటురాయి కానీ ఏ భాషకు చెందిన వ్యక్తి అని కాదు. కాకపోతే.. ఆయా ప్రాంతాల్లో జన్మించడం ద్వారా ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని అంటూంటారు. తమిళ హీరో సిద్ధార్ధ్ కు పై మాట అక్షరాలా వర్తిస్తుంది. తమిళనాట జన్మించిన వ్యక్తే అయినా కూడా తెలుగు సినిమాల్లో హీరోగా చేసి ప్రేక్షకాభిమానుల ఆదరణ పొందాడు. అంతగా తెలుగు సినిమాల్లో నటించి మన్ననలు అందుకున్నాడు. నేడు సిద్ధార్ధ్ పుట్టినరోజు.

 

 

ఓ దశలో సిద్ధార్ధ్ ను తమిళ హీరో అనే భావమే లేకుండా పోయింది తెలుగు ప్రేక్షకులకు. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్ధ్ ను చూస్తే మనింట్లో కుర్రాడు.. రోజూ మన వీధిలో చూసే కుర్రాడు కనిపిస్తాడు కానీ హీరో కనిపించడు. అమాయకంగా నటించినా.. క్లైమాక్స్ లో కంటతడి పెట్టించినా అది కళాకారుడిగా సిద్ధార్ద్ నటనలో ని వైవిధ్యమే అని చెప్పాలి. తెలుగులో సిద్ధార్ద్ వరుస సినిమాలు చేయడం చూసి ‘నన్ను తమిళనాడులో తెలుగు హీరో అని.. తెలుగులో తమిళ వ్యక్తి’ అని అంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ స్థాయిలో తెలుగులో సినిమాలు చేశాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా. బొమ్మరిల్లు, ఓయ్, ఆట, 180.. వంటి 14 స్ట్రైట్ తెలుగు సినిమాలతో ఆకట్టుకున్నాడు.

 

 

యువ, బాయ్స్ వంటి తమిళ సినిమాలోతో తెలుగు హీరోగానే ఆకట్టుకున్నాడు. తెలుగులో చేసిన స్ట్రైట్ సినిమాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా. బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రంగ్ దే బసంతిలో కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు2లో విలన్ గా నటిస్తున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: