టాలీవుడ్ ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.  అంతకు ముందు ఈ నగరానికి ఏమైంది మూవీలో నటుడిగా సినీ పరిశ్రమకు  పరిచయమైన ఈ హీరో.. పక్కా హైదరాబాదీ నేటివిటీతో ‘ఫలక్‌నుమా దాస్’ మూవీ రూపొందించారు. హైదరాబాద్ లో ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ.. అయితే ఈ మూవీపై మొదట్లో విమర్శలు వచ్చాయి. దాంతో ఈ యంగ్ హీరో రెచ్చిపోయాడు.. మీడియా సాక్షిగా బూతు పురాణం అంటుకున్నాడు.. అప్పట్లో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.  స్వియ దర్శకత్వ ప్రతిభ చూపిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించారు.

 

కంటెంట్ లేని కథకి బూతు డైలాగ్‌లు, శృంగారం సన్నివేశాలు, హింసాత్మక సీన్స్‌తో ప్రేక్షకుల తలలు బొప్పికట్టించారు. దాంతో రివ్యూలు కూడా నెగిటీవ్ గా రావడంతో మీడియా.. మరికొంతరిపై ఫైర్ అయ్యాడు. ఆ మద్య నాని నిర్మాణంలో ‘హిట్’ మూవీలో నటించాడు విశ్వక్ సేన్. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది.  ఈ మూవీ మంచి హిట్ అందుకోవడంతో ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది.  వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి.  విష్వక్సేన్ విభిన్నమైన పాత్రలను చేస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన 'హిట్' సినిమా నటన పరంగా ఆయనను మరోమెట్టుపై నిలబెట్టింది.

 

 తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ఇక స్టైలీష్ హీరో అల్లు అర్జున్ అయితే .. హ్యాండ్సమ్ హీరోగా మహేశ్ బాబు కనిపిస్తాడు.  నాకు అవకాశం వస్తే.. మల్టీస్టారర్ మూవీలో నటించాల్సి వస్తే.. నాని అన్నతో నటించాలని ఉందన్నాడు. ఇక దర్శకుల విషయానికొస్తే, నా అభిమాన దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పేరు చెబుతాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: