లాక్ డౌన్ పొడిగింపుతో ఈ ఏడాది సినిమాలపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎనిమిది నెలల్లో వద్దామనుకున్నా.. కరోనా కలకలంతో రాలేని సినిమాల లిస్ట్ దాదాపుగా ఖరారైంది. సెట్స్ పై ఉంటూ.. ఊగిసలాడుతున్న చాలా సినిమాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

 

చిరంజీవి, కొరటాల కాంబినేషన్ మూవీ ఆచార్యను ఆగస్ట్ 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కరోనా రాకతో నాన్ స్టాప్ గా జరుగుతున్న షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడింది. ఆగస్ట్ చేదాటినా సైరా మాదిరి దసరా సెలవులకు వస్తుందన్న నమ్మకం ఉండేది. లాక్ డౌన్ కొనసాగింపు.. ఎప్పుడు ఎత్తేస్తారో.. ఎప్పుడు పరిస్థితులు నార్మల్ స్టేజ్ కు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు సగం కూడా షూటింగ్ పూర్తికాని... ఆచార్య ఈ ఏడాది రావడం కష్టమేనంటున్నాడు దర్శకుడు. 

 

ప్రభాస్ సినిమా ఈ ఏడాది లేనట్టే. వర్కింగ్ టైటిల్ జాన్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ తో జార్జియా షూటంగ్ ను మధ్యలో ఆపేసి ఇండియాకు తిరిగొచ్చేసింది. మళ్లీ అక్కడికే వెళ్లి బాలెన్స్ సీన్స్ తీసుకురావాలి. ఇండియాలో కరోనా సద్దుమణిగినా.. విదేశాల్లో షూటింగ్ అంటే.. ఇప్పట్లో అనుమతులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన దసరాకు వద్దామనుకున్న జాన్ 2021కు వెళ్లిపోతున్నాడు. 

 

సంక్రాంతికి అల వైకుంఠపురములోతో వచ్చి అదిరిపోయే హిట్ కొట్టిన బన్నీ.. ఈ ఏడాది మరో సినిమాతో వద్దామనుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లేటుగా మొదలైనా.. స్పీడ్ గా పూర్తిచేసి దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటే కరోనా అడ్డుపడింది. నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయడం జరిగే పనికాదు. 

 

అదిగో ఇదిగో అంటూ ఊరించిన పెద్ద సినిమాలు హ్యాండ్ ఇవ్వడంతో.. వచ్చే ఏడు నెలల్లో కనిపించే స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కటే. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరమైన పవన్ వకీల్ సాబ్ గా వస్తున్నాడు. కరోనా హంగామాతో.. సినిమా సందడి లేకుండా పోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలు కనిపించకపోవడంతో బాక్సాఫీస్ డీలా పడిపోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: