మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం, వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథలో పలురకాల కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన పలు ఆసక్తికర విశేషాలను నేడు దర్శకుడు కొరటాల శివ ఈనాడు పత్రికతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారితో పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని, తను మాత్రమే కాక ఎందరో దర్శకులు ఆయనను ఒకసారి దర్శకత్వం వహిస్తే చాలు అని భావిస్తుంటారు అని అన్నారు. ఇక మా ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా ఎంతో పవర్ఫుల్గా ఆయన పాత్రను డిజైన్ చేయడం జరిగిందని, ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాని ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో ఆపివేయడం జరిగిందని కొరటాల అన్నారు. 

IHG

ఇకపోతే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందని, దానిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని భావించి, ఆ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పానని, ఆ తర్వాత ఒక రోజు చరణ్ కు కథతోపాటు ఆ పాత్ర గురించి వివరించగా ఆయన చేస్తానని ఒప్పుకున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం మరో వైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటిస్తున్న నేపథ్యంలో, మా సినిమా ఎంతవరకు చేస్తారు అనేది చెప్పలేని పరిస్థితి కొరటాల అన్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ ఆగిపోవటంతో సినిమా ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాదు, వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది అంటూ పలు పుకార్లు ప్రచారం అవుతూ తనలో కొంత టెన్షన్ నీ కలవరాన్ని రేకెత్తిస్తున్నాయని అన్నారు కొరటాల. ఇటీవల ఒకానొక సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి ఈ సినిమా గురించి మాట్లాడుతూ, లోలోపల కొంచెం టెన్షన్ గా ఉంది సార్ అని అనగానే, మరి సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారని అని ఆయన అడిగారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఇప్పుడే చెప్పలేనని తాను తెలిపినట్లు చెప్పారు కొరటాల. 

IHG

సరే మీకు ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే నేనున్నాను, మీకు తోడుగా ఉంటాను అంటూ సూపర్ స్టార్ మహేష్ తనకు అభయం ఇచ్చారని, అంత పెద్ద స్టార్ హీరో ఏ మాత్రం స్టోరీ గురించి కానీ ఆ క్యారెక్టర్ గురించి కానీ వినకుండా మీకు నేను ఉన్నాను, సాయం చేస్తాను అనటం ఎంతో గొప్ప విషయమని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు కొరటాల. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భయంతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని, ముందుగా ఈ మహమ్మారి నుండి ప్రపంచాన్ని రక్షించుకుందాం అని ఆ తర్వాతనే సినిమాల గురించి ఆలోచిద్దాం అని కొరటాల చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: