గత కొంత కాలంగా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కి దూరంగా ఉంటున్నారని... దానికి కారణం వాళ్ళిద్దరు శాశ్వతంగా విడిపోవడమేనని ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. అయినా ఎప్పుడూ చాలా అన్యోన్యంగా, చూడచక్కగా కనిపించే వీళ్లిద్దరూ కలిసే ఉన్నారని అందరూ భావించారు. ఓ నెల క్రితం సుమ కనకాల ఒక ప్రోగ్రాములో తన భర్త రాజీవ్ కనకాల మీద సెటైర్లు కూడా వేశారు. దాంతో సుమ కనకాల రాజీవ్ కనకాల మధ్య వివాహ బంధం దృఢంగానే ఉందని అందరూ నమ్మేశారు. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం వీళ్ళిద్దరూ తమ ఇష్ట ప్రకారము ఒక ఏడాదిన్నర క్రితమే అధికారికంగా విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది.


వాస్తవానికి యాంకరింగ్ రంగంలో సుమ లాంటి పద్ధతి గల యాంకర్ ను ఎవరు చూసి ఉండరు. తాను ఏ ప్రోగ్రాం లో వ్యాఖ్యాతగా చేసినా అసభ్యకరంగా అస్సలు మాట్లాడరు, అసభ్యకర బాడీ లాంగ్వేజ్ ని అనుసరించారు. అందుకే తెలుగు ప్రేక్షకులందరికీ సాంప్రదాయకంగా ఉండే ఆమె అంటే ఎంతో ఇష్టం. బడా స్టార్ హీరోయిన్ల కంటే సుమ గురించే ప్రతి ఒక్కరికి తెలుసంటే అతిశయోక్తి కాదు. 'సుమ అక్కగా' అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో భర్తకు దూరమయ్యేంత గొడవ ఏమి జరిగి ఉంటుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయాయి.


దాదాపు నాలుగేళ్ల గా సుమ కనకాల మధ్య అసలు మాటలే లేవట. అందుకే వారిరువురు ఒకరికొకరు సపరేటు గా ఉంటున్నారు. సుమ కొనుగోలు చేసిన మణికొండ ఇంటిలో రాజీవ్ కనకాల నివసిస్తుండగా సుమ వేరొక ఇంటిలో ఉంటున్నారు. సుమ రాజీవ్ కనకాల కి దూరంగా ఉంటున్నప్పటికీ... తన అత్తమామలకు కోడలి లాగానే బాధ్యతలు నిర్వర్తిస్తూ వారు బతికున్నంత వరకు ఎన్నో సేవలు చేసింది. రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి చనిపోతే... సుమ అన్నీ తానై ఉత్తర క్రియలు కూడా జరిపించింది. కానీ తన భర్తకు ఆమెకు మధ్య ప్రస్తుతం ఏ బంధం లేదని తెలియడం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది.


ఏది ఏమైనా టీవీ, సినిమా, మోడలింగ్ రంగాలలో అడుగుపెట్టిన వివాహితలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. విడాకులు అయినప్పటికీ ఎవరి దారి వారు చూసుకొని తమ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తూనే ఉంటారు. నిజానికి పెళ్లికాకముందు సినిమాలో నటించిన సుమ పెళ్లయిన తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు. తన భర్త రాజీవ్ కనకాలను ఏ సందర్భంలోనూ నొప్పించకుండా బుల్లితెర రంగంలో కూడా చాలా పద్ధతిగా నడుచుకున్నారు. కానీ వారి ఇద్దరి మధ్య ఏ విషయంలో బెడిసి కొట్టిందో గానీ... ప్రస్తుతం సుమ లాంటి మహిళే తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోలేకపోయిందంటే... మిగతా యాంకర్ల వివాహ బంధాలు ఎప్పుడు పట్టు మంటాయో అనే అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: