వీరిద్దరూ కలిస్తే ప్రేక్షకులకు పెద్ద పండుగ. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా మరో సినిమా రానుంది. వారు ఎవరో అనుకుంటున్నారా చిరంజీవి - మోహన్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో వీరిద్దరిదే ప్రత్యేకమైన అనుబంధమని చెప్పొచ్చు. ఇద్దరూ మిత్రులో.. శత్రువులో అర్థంకాని అయోమయం క్రియేట్ చేస్తారు. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఇలాంటి అనుబంధమే కొనసాగుతోంది. 

 

అయితే మోహన్ బాబు - చరంజీవి ఇటీవలే తమ మధ్య ఉన్న కోల్డ్ వార్ కి స్వస్థి పలికేశారు. ఇద్దరకిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర చేస్తున్నట్లుగా వార్తలు కూడా షికారు చేసాయి. అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో చిరుతో మోహన్ బాబు మళ్లీ కలిసి నటిస్తున్నాడా లేదా.. అనే క్లారిటీ లేకుండాపోయింది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కామెడీ విలన్ రోల్ ఉందట.. ఆ క్యారెక్టర్ ని మోహన్ బాబుని చేయమని అడగుతున్నాడట చిరంజీవి.

 

అయితే కామెడీ రోల్ కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఏదైనా ఉంటే చేస్తానంటూ మోహన్ బాబు నుంచి సమాధానం వచ్చిందట. దీంతో మోహన్ బాబుకి నెగటివ్ షేడ్స్ రోల్ ఉండేలా చూడమని చిరు కొరటాలని అడిగాడట. దీనికి తగ్గట్టుగా కొరటాల మళ్లీ కథలో మార్పులు చేస్తున్నాడట. 

 

ఈ విషయమై చిరంజీవి నుంచి కూడా ప్రెజర్ వస్తుండటంతో కొరటాల కాస్త ఇబ్బంది పడుతూనే మరోసారి 'ఆచార్య' స్క్రిప్ట్ ని మారుస్తున్నట్లుగా సమాచారం. ఏదేమైనా ఇన్నేళ్ల తర్వాత ఈ చిరకాల శత్రువులు.. సారీ.. చిరకాల మిత్రులు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: