ఒకప్పుడు మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఎక్కువగా ఆటలు ఆదుకోవడం లేదా, కొంత డబ్బున్న వారి ఇంట్లో అయితే టీవీ లు ఉండేవి కాబట్టి వాటిలో వచ్చే ప్రోగ్రామ్స్ చూడడం చేసేవారు. ఇక ఆదివారాలు వచ్చినపుడు కుటుంబం అందరూ సినిమాలు చూసేవారు. ఇక రాను రాను మెల్లగా కాలం మార్పు చెందడంతో పాటు టెక్నాలని కూడా రోజుకో రకంగా కొత్తపుంతలు తొక్కుతూ ముందుకు సాగడం మొదలైంది. ఇక ఆపై టీవీల్లో రకరకాల మోడల్స్ రావడం, దాని అనంతరం కంప్యూటర్ల రాక, ఇక అక్కడి నుండి మెల్లగా ఎలక్ట్రానిక్ ఉపకారణాలు పెరగడంతో మనకు ఎంటర్టైన్మెంట్ మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఇక టివిలో సీరియల్స్ తో పాటు సినిమాల్లో క్వాలిటీ పెరగడం, దానితో ప్రతి ఊరిలోనూ థియేటర్స్ కూడా పెరిగాయి. 

 

ఇక నేటి స‌మాజంలో అంతా స్మార్ట్‌ఫోన్ మ‌యం అయిపోయింది. ప్ర‌పంచాన్ని అంతా స్మార్ట్‌ఫోన్‌లోనే చూసేస్తున్నారు. అయితే సెల్ ఫోన్స్ లో ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్, ఓటిటి యాప్స్ లో సినిమాలు చూడడం మరింతగా అలవాటు అయిపోయింది. అంతేకాకుండా.. యూట్యూబ్ లో గాని లేదా ఇతర మీడియా ప్లాట్ ఫామ్స్ లో కానీ ఎక్కువగా ఆకట్టుకునే ప్రోగ్రామ్స్, షోస్, షార్ట్ ఫిలిమ్స్, వీడియోలు వంటివి ఉంటేనే చాలామంది చూస్తున్నారు. అందువలన కొందరు ఎంతో తెలివిగా తమకు నచ్చిన విధంగా ప్రోగ్రామ్స్, షార్ట్ ఫిలిమ్స్, రకరకాల వంటలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి ఉన్న టాలెంట్ తో వారు యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 

 

ఇక యూట్యూబ్ లో ఎక్కువగా ఈ మధ్య కొందరు యువత తమ టాలెంట్ తో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఒకప్పటి మాదిరిగా టాలెంట్ ఉన్నవారు మూలన ఉండిపోవలసి అవసరం లేదు. కాదేది కళకు అనర్హం అన్నట్లుగా, తమ నచ్చిన షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేస్తున్నారు. అందులో బాగా మంచి కాన్సెప్ట్ తో తీయబడిన షార్ట్ ఫిలిమ్స్ కు మంచి ఆదరణ లభించడంతో పాటు అటువంటి వారిని సినిమా అవకాశాలు కూడా వరించిన సందర్భాలు ఇటీవల అనేకం ఉన్నాయి. ఇక ప్రస్తుతం 'కళా మీడియా వర్క్స్' యూట్యూబ్ ఛానల్ వారు పోస్ట్ చేసిన ''మనసా నమః'' అనే సరికొత్త షార్ట్ ఫిలిం అందరి మనసు గెలుచుకుంటోంది.

 

ముఖ్యంగా నేటి కాలం అమ్మాయిల మనస్తత్వాలు, వారితో అబ్బాయిలు ఎలా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ తో ఒకింత సరదాగా రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే రెగ్యులర్ కి భిన్నంగా అంతా వెనుకనుండి ముందుకు, అంటే రివర్స్ గేర్ ఫార్ములా కెమెరా టేకింగ్ తో రూపొందించబడ్డ ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఎంతో బాగుండడంతో పాటు టెక్నీకల్ గా, అలానే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అదరగొట్టారు అనే చెప్పాలి. మెయిన్ రోల్ చేసిన అశ్విన్ తన స్టోరీ గురించి శీతా కాలం, చైత్ర మాసం, వర్షా కాలం అంటూ మూడు విభిన్న కాలాలను చూపిస్తూ తీసిన విధానం అద్భుతం అని చెప్పాలి. 

 

మొత్తంగా ఈ ''మనసా నమః'' షార్ట్ ఫిలిం నిజంగా చూసే ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. కళా మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన ఆ షార్ట్ ఫిలిం లో అశ్విన్ విరాజ్, ద్రిషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ తదితరులు నటించగా యువ దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాతగా శిల్ప గజ్జల వ్యవహరించారు. ఇక ఈ షార్ట్ ఫిలిం లో సాంగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగుంది, దీనికి సంగీతం అందించింది కామ్రాన్......!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: