పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేస్తున్నారు అనగానే దాని మీద ఎన్నో అంచనాలు ఉంటాయి జనాలకు. ఆ సినిమా బడ్జెట్ నుంచి ప్రతీ ఒక్కటి కూడా హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తారు. కరోనా కారణంగా షూటింగ్ జరగడం లేదు. జరిగినా సరే ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ఎవరూ కూడా ఒక అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. 

 

లాక్ డౌన్ ని కూడా కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు వచ్చే సినిమాలు ఏంటీ అనేది చెప్పడం చాలా కష్టం. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు సినిమా వస్తుంది అని వార్తలు వస్తున్నాయి, వీరి కాంబినేషన్ లో ఒక సినిమా దాదాపుగా రెడీ అయిందని కాని కొన్ని కారణాలతో ఇప్పుడు అది వాయిదా పడింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో ముందు సినిమా చెయ్యాలి అని చూసినా సరే కొన్ని కారణాలతో ఆ సినిమాను వాయిదా వేస్తాను అని చెప్పాడట త్రివిక్రమ్. 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కథ కూడా రెడీ అయింది షూటింగ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా కథ కూడా రెడీ గానే ఉంది. మహేష్ బాబు ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు. అయితే కొన్ని కారణాలతో త్రివిక్రమ్ ఆగారు. ఇప్పుడు అది ఫైనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: