టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాతలు కరోనా దెబ్బకు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. భారీగా పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు బాగానే ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అగ్ర దర్శకులతో సినిమాలు చేయించాలి అని భావించి అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. కాని అనూహ్యంగా కరోనా రావడం జనాలు బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోవడం తో ప్రస్తుతం ఏ సినిమా కూడా షూటింగ్ కి వెళ్ళే అవకాశం లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా దాదాపుగా విడుదల అయ్యే అవకాశాలు అసలు లేవు. 

 

ఇక భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. టికెట్ ధరలను పెంచాలని హీరోలను అడుగుతున్నారు. హీరోల నుంచి ప్రభుత్వాన్ని కోరాలని వాళ్ళు భావిస్తున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అగ్ర నిర్మాతలు అందరూ కూడా అగ్ర హీరోల ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకు లేఖలు రాసే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని అడిగినట్టు సమాచారం. అల్లు అరవింద్ కూడా మరో హీరోని అడిగినట్టు తెలుస్తుంది. 

 

నిర్మాతల కష్టాలను ప్రభుత్వానికి వివరించి అప్పుడు ధరలను పెంచాలని అడిగే అవకాశం ఉందని టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా ఉందని అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి అని వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ధరలు పెంచితే మినహా సినిమాలకు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అందుకే ఆయన కూడా ప్రభుత్వాన్ని ధరలను పెంచాలని కోరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: