టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఆయన సినిమాల్లో నటించడానికి గానూ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి వాతావరణం లేదు అనేది కొందరి మాట. ఆయన తో సినిమా చేస్తుంటే హీరోయిన్ కి అసలు ప్రాధాన్యత ఉండదు అనే భావనలో ఉన్నారట. ఆయన తో సినిమా చేస్తే ఆయన్నే చూస్తారు గాని మమ్మల్ని ఎందుకు చూస్తారు అనేది హీరోయిన్ ల మాట. 

 

ఇక అగ్ర హీరోయిన్ లు కూడా ఆయన సినిమాలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఉండదు అనే భావిస్తూ ఉంటారని సమాచారం. ప్రస్తుత౦ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. ఆ సినిమాలో హీరోయిన్ గా అనుష్క ను తీసుకోవాలని క్రిష్ భావించారని సమాచారం. దానికి అనుష్క నో చెప్పినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ సినిమాలో ఏ స్థాయిలో నటించినా సరే గుర్తింపు అనేది రాదని ఆమె వద్దని అన్నట్టు తెలుస్తుంది. 

 

ఇక వకీల్ సాబ్ సినిమాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎలాగూ ప్రాధాన్యత ఉండదు. ఇక ఆ సినిమాలో చేసే రెండు పాటలు ఒక పది నిమిషాల సన్నివేశం కోసం ఎందుకు అవసరమా అనే భావనలో హీరోయిన్ లు ఉన్నారని అందుకే ఓకే చెప్పడం లేదని సమాచారం. పవన్ అడిగినా సరే స్పందించడం లేదని టాలీవుడ్ లో ప్రచార౦.

మరింత సమాచారం తెలుసుకోండి: