టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. ఆమె కు ఉన్న ప్రాధాన్యత ఈ మధ్య కాలంలో ఎవరికి లేదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు ఆమె ముందు వచ్చినా ఆమె తర్వాత వచ్చినా సరే ఆమెను మాత్రం బీట్ చేయలేదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చే పరిస్థితి కూడా ఉందీ అనేది కొందరు చెప్పే మాట. అయితే అనుష్క మాత్రం ఇప్పుడు సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అనుష్క చేసే సినిమాల కోసం ఇది వరకు హీరోలు కూడా ఎదురు చూసే వారు. 

 

కాని ఇప్పుడు ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదని టాక్. ఆమె సినిమా చెయ్యాలి అనుకున్నా సరే ఆమె ను ఒకప్పుడు కోరిన దర్శకులు కూడా పక్కన పెట్టారని టాక్. దానికి స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేకపోయినా ఆమె వయసు మీద పడుతు౦ది అందుకే ఆమెను పక్కన పెట్టారని సమాచారం. అనుష్క ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల తర్వాత ఆమె చేసే సినిమా ఏంటీ అనేది ఎవరికి తెలియదు. ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆమెకు పెళ్లి ఆసక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే... 

 

టాలీవుడ్ లో కొందరు మాత్రం ఆమెకు పెళ్లి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆమె సినిమా చెయ్యాలి అని చూసినా సరే కొందరు పక్కన పెడుతున్నారు. కారణం ఏంటో స్పష్టంగా తెలియదు. ఇక ఆమెకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని కాని అది హీరోయిన్ గా కాదని మరో రకంగా ఆమెను సినిమాల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఆమె వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: