పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొన్ని సినిమాలు ముహూర్తం పెట్టి ఆగిపోగా.. కొన్ని సినిమాలు పోస్టర్స్ రిలీజ్ చేశాక కూడా ఆగిపోయాయి. పాతిక సినిమాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ పది విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. అందులో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాలని ఉంది సినిమా. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం.రత్నం ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. పవన్, అమీషా పటేల్ కలిసి ఉన్న పోస్టర్స్ కూడా సినిమా రిలీజ్ చేశారు. 

 

అయితే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. అదే సినిమా కథను నువ్వే కావాలి అని తరుణ్, రిచాలతో తీశారు. ఇక పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమాను కూడా ఎనౌన్స్ చేసి ఆ సినిమాను తెరకెక్కించలేదు. పవన్ కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ చేయాలని అనుకున్న సత్యాగ్రహి సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాస్ రావు డైరక్షన్ లో జీసెస్ క్రిస్ట్ సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ దేశభక్తి నేపథ్యంలో దేశి అనే సినిమా తీయాలని అనుకున్నారు. అది కూడా సెట్స్ మీదకు రాకుండానే ఆగిపోయింది. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని లారెన్స్ ఎప్పటినుండో అనుకుంటున్నాడు.. పవన్ కోసం ఒక అద్భుతమైన కథ రాసినట్టు అప్పట్లో చెప్పిన లారెన్స్ పవన్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో సైలెంట్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్ డైరక్షన్ లో పవన్ కోబలి సినిమా కూడా చేయాల్సింది కానీ చేయలేదు. ఇక విక్టరీ వెంకటేష్, మహేష్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బదులుగా పవన్ ను అనుకున్నారు.. కానీ పవన్ చేయనని చెప్పేసరికి మహేష్సినిమా చేశాడు. వినాయక్ తో పవన్ సినిమా అనుకున్నారు అది కూడా ఆగిపోయింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ముందు సంపత్ నంది డైరక్ట్ చేయాలని అనుకున్నాడు. ముహూర్తం కూడా పెట్టుకున్న ఆ సినిమాకు సంపత్ నంది ఎగ్జిట్ అయ్యి డైరక్టర్ బాబీకి ఛాన్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఖుషి 2 కూడా ఎప్పటినుండో అనుకుంటున్నారు కానీ అది కూడా సెట్స్ మీదకు వెళ్లట్లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: