కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ వస్తున్నారు. అదొక్కటే సరిపోదని భావించి దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో పనులు లేక ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. వీరికి తోడుగా మేము కూడా ఉన్నామంటూ రాజకీయ సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. మన టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఎప్పటిలాగే కష్టమొస్తే మేము మీ వెంటే అంటూ విరాళాలు ప్రకటించారు.

 

కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. కానీ ఒకరిద్దరు హీరోయిన్స్ తప్ప స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఇంత‌వ‌ర‌కు క‌రోనా క్రైసిస్ ఫండ్ కు విరాళం ఇవ్వ‌డానికి ముందుకు రాలేదని చెప్పొచ్చు

 

ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ఓం నమో వేంకటేశాయ ఫిల్మ్స్ అధినేత ‘శిరిడి సాయి’ సినిమా నిర్మాత మరియు ఏఎమ్ఆర్ గ్రూప్ చైర్మన్ ‘మహేష్ రెడ్డి’ ముందుకొచ్చారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి కోటి రూపాయిలను విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణకు ప్రకటించిన ఫండ్ ను కేటీఆర్ ను కలిసి చెక్ రూపంలో అందజేశారు. కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయి. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా పాటించాల‌ని మహేష్ రెడ్డి కోరుతున్నారు. ఇక ప్రజలు కూడా ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలని అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: