నేను ఎక్కువ‌గా డ‌బ్బుల‌ను వేస్ట్ ఖ‌ర్చు చేయ‌ను అంటున్నారు బాలీవుడ్ హీరో అక్ష‌య్‌. “నెలకు మూడు వేలకు మించి నా పాకెట్ మనీ ఖర్చు కాదు”…అని అక్షయ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్‌’కు హాజరైన అక్షయ్ కుమార్.. తన నెలసరి ఖర్చు పది వేల రూపాయల లోపే అవుతుంద‌ని అన్నారు . ఎక్కువంటే మూడు వేలకు మించి నా పాకెట్ మనీ ఖర్చు కాదు. నేను మద్యం సేవించను. సిగరెట్లు తాగను. షూటింగులకు వెళ్తే నిర్మాతే నా ఖర్చంతా భరిస్తారు. ఇక నాకు పెద్ద‌గా ఖర్చు ఉండ‌దు.. అంటూ అక్షయ్ కుమార్ చెప్పారు. ఇక ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాతో అన్యోన్యంగా ఉంటారు.


 
బాలీవుడ్‌ హీరో, హీరోయిన్లు అంటే అర్ధరాత్రి వరకు పార్టీలు, పబ్‌లతో ఎంజాయ్ చేస్తారన్న విష‌యం  తెలిసిందే. అయితే, అక్షయ్ కుమార్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం అంటున్నారు. పార్టీలకు,పబ్‌లకు, ఆరోగ్యం, ఆహార నియమాలను వందశాతం పాటించేందుకు ప్రయత్నిస్తాన‌ని ఆయ‌న అన్నారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటాన‌న్నారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలో నిద్రపోతాను. ఉదయమే లేచి వర్కవుట్లు చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. ఇక ఈ విధంగా చూస్తే అక్షయ్ కుమార్ దినచర్య షూటింగ్ ఉన్నా లేకున్నా..ఉదయం 4 గంటలకే ప్రారంభం అవుతుంది. సాధారణంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సమయానికి పార్టీల నుంచి తిరిగి వచ్చి నిద్రపోతుంటారు. అక్షయ్ జాగింగ్‌కు వెళ్తున్న సమయంలో చాలా మంది హీరో, హీరోయిన్లు పార్టీల నుంచి తిరిగి వస్తూ ఆయనకు ఎదురుపడుతారట. “షూటింగులకు లేటుగా వెళ్లడం వల్ల నిర్మాతకు, ఇతర నటీనటులకు ఇబ్బందిగా కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటాను” అని అక్షయ్ కుమార్ చెప్పారు.

 

ప్రతీ సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకొంటావే. మ‌రి ఆ డబ్బులన్నీ ఏం చేస్తావు అని కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు.. నా సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంటాయి. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో మంచి పనుల కోసం ఉపయోగిస్తాను. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతాను. డబ్బు విలువ నాకు తెలుసు. దానిని దుర్వినియోగం మాత్రం చేయడం ఇష్టం ఉండదు అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: