కొన్ని కొన్ని రంగాలలో ఏనాటికైనా గుర్తు పెట్టుకొనేవళ్ళు అతి కొద్ది మాత్రమే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. వేళ్ళ మీద లెక్కపెట్టే వాళ్ళనే గొప్పవాళ్ళు, మహాను భావులు అంటాము. ఒక గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళి నప్పుడు ఒకే రకంగా మాట్లాడుకునేవాళ్ళు ఎంతో అరుదుగా ఉంటారు. వాళ్ళు చేసిన మంచి తర తరాలు చెప్పుకుంటూ ఆ తర్వత తరాలకి ఆదర్శంగా తీసుకునే గొప్ప వాళ్ళు చరిత్రలో నిలిచిన వాళ్ళు వాళ్ళకంటు ఒక చరిత్ర ఉన్న వాళ్ళు వందల సంవత్సరాలు గడిచిన మన మధ్యనే ఉన్నారన్న భావనలోనే ఉంటారు. ఆలాంటి మహా వ్యక్తే "దర్శకరత్న" బిరుదాంకితులు శ్రీ దాసరి నారాయణరావు గారు.

 

చిత్ర పరిశ్రమకి వచ్చిన ఎందరో .. సినిమా దర్శకుడిగానో, నిర్మాతగానో, నటుడిగానో, లేదా రచయితగానో గుర్తింపు పొందుతారు. అయితే ఇలా ఒక విభాగంలో విజయం సాధించడమే చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టతరం అవుతుంది. దానికోసమే సగం జీవితం గడిచిపోతుంది. కానీ దాసరి నారాయణ రావుగారు మాత్రం దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా, సాహిత్య రచయితగా, పత్రికాధిపతిగా, రాజకీయ నాయకుడిగా గొప్ప కీర్తిని గడించారు. దాసరి నారాయణ రావు గారి పేరు చెబితేనే ఇండస్ట్రీ మొత్తం తలెత్తుకొని చూడటమే కాదు కొంతమందికి గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తేలా తన ఉనికి చాటుకున్నారు. 

 

మాటల్లో ముక్కుసూటి తనం, ఆలోచనలలో ఆశాభావం, నడవడికలో మార్గదర్శం, ప్రవర్తనలో కలుపుగోలు తనం, చేతులలో చేయూతనందించే పట్టు ..ఇలా చెప్పుకుంటూ పోతే దాసరి గారు చిన్న వాళ్ళకు మార్గదర్శకులు, సమానులకి స్నేహశీలి .. ఆయన లేని లోటు ఎప్పటికి ఎవరూ భర్తీ చేయలేరు... తీర్చలేరన్న మాటలల్లో అతిశయోక్తి లేదు. దర్శకులైన దగ్గర్నుంచి ప్రతీ ఏటా తన పుట్టినరోజుకి 24 విభాగాలలో ఉన్న ప్రతీ ఒక్కరికి సహాయం చేయడం మొదలు పెట్టిన దాసరి గారు ఆయన చివరి శ్వాస వరకు అది సంపూర్ణంగా చేయగలిగారంటే ఆయన నిర్ణయం, పట్టుదల ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 

 

ఇక సినిమా రంగానికి కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులను అలాగే మొహన్ బాబు లాంటి నటులను పరిచయం చేశారంటే తోటి వారిని తన స్థాయికి తీసుకు రావాలన్న తపన ఎంతగా ఉండేదో ఊహించుకోవచ్చు. చిత్ర పరిశ్రమ మొత్తం తన కనుసైగలలో ఉన్నప్పటికి ఏనాడు ఎవరీని శాసించలేదు ..కేవలం సలహాలిచ్చారు అంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో ఇంతకంటే చెప్పడానికి ఉదాహరణ ఇంకేముంటుంది.

 

పత్రికా రంగంలో అడుగుపెట్టిన దాసరి గారు తన పని తను చేసుకుంటూ వెళుతున్నప్పటికి ఎంతమందికి చమటలు పట్టాయో చాలామందికి తెలిసిందే. ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేని వాళ్ళు వెనకాల ఎన్నో మాటలన్నప్పటికి దుమ్ము తో సమానంగా చూసి చిరునవ్వుతో ముందుకు సాగారంటే ఎంతటి ప్రశాంతమైన మనిషో అర్థమవుతుంది. సినిమావాళ్ళకి, స్నేహితులకి ప్రతీ ఒక్కరికి ప్రతీ విషయంలో గురువుగా తోడు ఉండి దారి చూపించారు. అందుకే అందరికీ "గురువు" గారు అయ్యారు దాసరి నారాయణ రావు గారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: