భామ కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అప్ప‌టికే మాలీవుడ్, కోలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిపోయింది. అయితే టాలీవుడ్ లో మాత్రం తొలి ప్ర‌య‌త్న‌మే భారీ స‌క్సెస్ అందుకుంది. అటుపై వ‌రుస‌గా యువ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు.. కొట్టేసింది. ఆ పై స‌క్సెస్ లు కూడా అందుకుంది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో స్నేహ పూర్వ‌కంగా చ‌నువుగా మెలిగేది. అమ్మ‌డిలో చ‌లాకీత‌నం..హీరోయిన్ అనే అహం భావం వంటివి ఎక్క‌డా చూపించేది కాదు. ఆ ల‌క్ష‌ణం న‌చ్చే నిర్మాత‌లు అమ్మ‌డికి అంతే వెయిట్ ఇచ్చేవారు. గంట‌ల కొద్ద ఓ నిర్మాత ఆఫీస్ లో అయితే టైంపాస్ సైతం చేసేది. ఆ నిర్మాత అమ్మ‌డిని కూతురుగా భావించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

 

అయితే ఈ ప్రాస‌స్ లోనే ఆ హీరోయిన్ కి త‌ను న‌టించిన ఓ యంగ్ హీరోల‌తో సైతం గొడ‌వ‌లు పెట్టుకున్నట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆ హీరోయిన్ కి త‌ల పొగ‌రెక్కువ అని కూడా బాగా ఫోక‌స్ చేసారు. అయితే లోలోప‌ల అమ్మ‌డి గురించి కొంత మంది ప‌నిగ‌ట్టుకుని ఎఫైర్ అని ముద్ర వేసి మ‌రీ ప్ర‌చారం చేసిన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ హీరోలంద‌రికి ఎఫైర్లు నేరిప్పింద‌ని…మ‌నస్ప‌ర్ధ‌లు రావ‌డంతో గొడ‌వ‌లుగా చిత్రీక‌రించి ఒక్క‌సారిగా దూర‌మైంద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో బాగా గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

 

అందుకే ఆ యంగ్ హీరోలు కూడా ఎప్పుడూ ఓపెన్ కాలేద‌ని….స‌ద‌రు హీరోయిన్ రెండు..మూడు సార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వేదిక‌ల పైన‌ వేరే ర‌కంగా మాట్లాడింద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత అన్న‌ది! మాత్రం తెలియాలి. అయితే రంగుల ప్ర‌పంచంలో మాత్రం ఇవ‌న్నీ స‌హ‌జంగా వినిపించేవే. ల‌వ్ .. డేటింగ్.. బ్రేక‌ప్ అంటూ చాలా మంది భామ‌ల విష‌యంలో జ‌రుగుతూనే ఉంటుంది. అయితే స‌ద‌రు హీరోయిన్ విష‌యంలో మాత్రం కొంత విష ప్ర‌చార‌మైతే జ‌రిగింద‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాల నుంచి కూడా అప్ప‌ట్లో వినిపించింది. ప్ర‌స్తుతం ఆ హీరోయిన్ తెలుగులో ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. మ‌రి ఈ భామ మీద వ‌చ్చిన అవాంత‌రాలు నిజ‌మా అబ‌ద్ధ‌మా అన్న‌ది స‌రైన క్లారిటీ అయితే లేదంటున్నారు కొంత మంది.

మరింత సమాచారం తెలుసుకోండి: