క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాచింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా క‌ఠ‌నంగా లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. ఇక లాక్ డౌన్ నేప‌థ్యంలో చాలా సినిమా రిలీజ్ లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 14 నుంచి మే 3 వ‌ర‌కూ మ‌ళ్లీ లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో రిలీజ్ ప్లానింగ్‌ల‌న్నీ కూడా మారాయి. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ మే 3 తో గ‌నుక లాక్ డౌన్ ఎత్తేస్తే ముందుగా రిలీజ్ అయ్యే సినిమాలివే నంటూ ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

 

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన `వి` చిత్రం , ఎనర్జిటిక్ స్టార్ రామ్ న‌టించిన `రెడ్` , మాస్ రాజా ర‌వితేజ న‌టించిన క్రాక్ చిత్రాలు జులైలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న వకీల్ సాబ్  కూడా ఆగ‌స్టులో, విక్ట‌రీ వెంకేటేష్ న‌టిస్తోన‌న నార‌ప్ప సెప్టెంబ‌ర్ లో, నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం అక్టోబ‌ర్ లో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంకా ఈ మ‌ధ్య‌లో ప‌లు చిన్న సినిమాలు, అనువాద చిత్రాలు డేట్లు లాక్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ లు అన్ని అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆధార ప‌డి ఉంటాయి. 

 

క‌రోనా వైర‌స్ నానాటికి విజృభింస్తోందే త‌ప్పించి ఈ వైర‌స్ మాత్రం అస్స‌లు త‌గ్గు ముఖం ప‌ట్ట‌లేదు. అయితే ఇలా లాక్ డౌన్ ఎన్నాళ్లు కొన‌సాగించ‌గ‌ల‌రు? కొన‌సాగిస్తే త‌లెత్తే ప‌రిణామాలను కూడా ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తుంది. ఈ నేప‌థ్యంలో ద‌శ‌ల వారిగా లాక్ డౌన్ పై ఆంక్ష‌లుంటాయ‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.  అయితే ఏప్రిల్ 20 నుంచే కొన్ని శాఖ‌ల వ‌ర‌కు లాక్ డౌన్ ఎత్తివేస్తార‌ని తెలిసింది. మ‌రి ఆ సోర్స్..ప్ర‌భుత్వం అధికార‌లు అంచ‌నాల‌ను బ‌ట్టి స‌ద‌రు హీరోలు రిలీజ్ లు ఇలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ చిత్రాల‌కి ఎంత మాత్రం క‌లెక్ష‌న్లు వ‌స్తాయి ఏంటి అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: