గత కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై ఏక ఛత్రాధిపత్యంతో తన అద్భుతమైన యాంకరింగ్ టాలెంట్ తో లేడీ యాంకర్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలతో దూసుకెళ్తోంది ఎవరు అని అనగానే మన అందరినీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుమ కనకాల. ముందుగా కొన్నేళ్ల క్రితం అక్కడక్కడా కొన్ని సీరియల్స్ లో నటించిన మలయాళ కుట్టి అయిన సుమ, తెలుగు మీద అభిమానంతో మన భాష నేర్చుకోవడంతో పాటు తన అద్భుతమైన వాక్చాతుర్యంతో వరుసగా అప్పట్లో అవకాశాలు అందుకున్నారు. ఇక ఇప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన ప్రోగ్రాం లలో సుమ లేనిదే నిండుతనం రాదు అనే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. 

 

అయితే కేవలం బుల్లితెరపైనే కాక, పలు సినిమా ఆడియో ఫంక్షన్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరించే సుమ, నటుడు రాజీవ్ కానుకలను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కొద్దిరోజుల క్రితం ఆమె అత్తగారైన లక్ష్మి దేవి గారు, ఆ తరువాత మామగారైన దేవదాస్ కనకాల గారు, ఆపై మొన్న ఒక వారం క్రితం ఆమె ఆడపడుచు అయిన శ్రీలక్ష్మి, ఇలా ముగ్గురూ కూడా ఒకరి తరువాత ఒకరు అకాల మరణం పొందడంతో సుమ ఫ్యామిలీ లో కొంత విషాద ఛాయలు చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా సుమ అత్తగారు చనిపోయిన సమయంలోనే ఆమెకు, భర్త రాజీవ్ కు అనధికారికంగా విడాకులు కూడా జరిగాయని, అప్పటినుండి సుమ విడిగా ఒక ఇంట్లో, అలానే రాజీవ్ విడిగా మరొక ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. 

 

అలా ఉంటున్నప్పటికీ కూడా అత్త మామలు, అలానే ఆడపడుచు మరణం సమయంలో ప్రక్కనే ఉండి, అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకుని తల్లోనాలుకలా వ్యవహరించారట సుమ. అయితే ఏమి జరిగింది, ఏమిటి అనే విషయాలు పూర్తిగా తెలియనప్పటికీ, ఇటీవల ఆడపడుచు మరణం తరువాత రాజీవ్ నుండి సుమకు మరింతగా దూరం పెరిగిందని అంటున్నారు. నిజానికి వారిద్దరి మధ్య పెద్దగా గొడవ పడ్డ సందర్భాలు లేనప్పటికీ, ఒకరి భావాలు మరొకరితో కలవకపోవడంతో వారిద్దరూ దూరంగా ఉంటున్నట్లు చెప్తున్నారు. కాగా నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై అధికారిక సమాచారం మాత్రం వెల్లడి కావలసి ఉంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: