డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. పూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ తో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రామ్ లోకి ఎనర్జీని, హీరోయిన్స్ అందాలు సినిమాకు బలాన్ని ఇచ్చి సూపర్ హిట్ చేశాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు పూరి. అయితే డైరక్టర్ గానే కాదు నిర్మాతగా  సినిమాను మోసే బాధ్యత ఎక్కువ అని అంటున్నాడు పూరి. 

 

కష్టపడి పైకొచ్చి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిన పూరి స్నేహితుడిని నమ్మి 100 కోట్ల పైగా పోగొట్టుకున్నాడు. అయితే అక్కడితో నిరాశ చెందకుండా మళ్ళీ సంపాదించుకున్నారు. వరుస ఫ్లాపులు వస్తున్నా ఏమాత్రం డీలా పడకుండా హిట్టు కొట్టే వరకు కసిగా పనిచేశాడు పూరి. డైరక్టర్ పూరి నిర్మాతగా మారి సినిమాలు చేయడం తాను అనుకున్న సినిమా అనుకున్న విధంగా చేసేందుకే అని చెబుతాడు. అయితే ఇండస్ట్రీలో అన్నిటికన్నా కష్టమైంది నిర్మాతగా సినిమా చేయడమే.. కాస్త బడ్జెట్ ఎక్కువవుతుంది అంటే ప్రతిరోజూ నిద్ర మాత్రలు వేసుకుని పాడుకోవాల్సిందే అంటున్నాడు పూరి. 

 

పూరి మంచి మనసు గురించి చెప్పాలంటే సీనియర్ నటి రమాప్రభ పూరి సినిమాలో తప్పకుండా ఉంటారు. పూరి సినిమా చేసినా చేయకపోయినా ఆమెకి ప్రతి నెల పాతిక వేల రూపాయలు క్రమం తప్పకుండా పంపిస్తాడట. అది పూరి జగన్నాథ్ అంటే.. దర్శక నిర్మాతగా పడుతూ లేస్తూ ఉన్న పూరి మునుముందు ఇంకా ఎన్నో గొప్ప విజయాలు అందుకోవాలని ఆశిద్దాం. విజయ్ దేవరకొండ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో రెండు వరుస ప్లాపులు అందుకున్న విజయ్ దేవరకొండ ఫైటర్ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: