తెలుగులో రచయితగా ఉండి దర్శకుడిగా మారిన వారిలో హరీష్ శంకర్ కూడా ఒకరు. దర్శకుడితో పాటు మంచి రచయిత హరీష్ లో ఉన్నాడు. రీమేక్ చిత్రాలలో సోల్ ని మాత్రమే తీసుకుని, పూర్తిగా మార్చి కథ రాయగలడు. ఆయన సినిమాల్లో మాటలు బావుంటాయి. స్టార్ హీరోకి మాటలెలా రాయాలో ఆయన దగ్గరే నేర్చుకోవాలని చెబుతుంటారు. మొన్నటికి మొన్న గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

 

 


పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ వంటి అద్భుత విజయాన్నందిన హరీష్ శంకర్ కి మరోసారి పవన్ కళ్యాణ్ ని దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ వరుసగా మూడు సినిమాలని ప్రకటించాడు. అందులో మూడవ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలోనిదే. స్వతహాగా పవన్ అభిమాని అయిన హరీష్, పవన్ కళ్యాణ్ ని ఒక అభిమానిగానే చూస్తాడు.

 

 

అందుకే గబ్బర్ సింగ్ లో ఫ్యాన్స్ విజిల్ వేసే సీన్స్ చాలా ఉంటాయి. అయితే కరోనా లాక్డౌన్ వల్ల షూటింగ్ లన్నీ అగిపోవడంతో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు మూడు కథల్ని సిద్ధం చేస్తున్నాడట. అందులో ఒక కథని ప్రత్యేకించి మహేష్ బాబు కోసం రాస్తున్నాడని టాక్.

 


సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పరశురామ్ తో కన్ఫర్మ్ అయిపోయినట్టే అని వార్తలొస్తున్నా, మళ్లీ త్రివిక్రమ్ పేరు కూడా వినబడడంతో అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ కథ రాస్తున్నానని బయటకి రావడంతో మరిన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఏదైనా లాక్డౌన్ తర్వాత క్లారిటీ వస్తుందని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: