సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు ప్రస్తుతం వారు గడుపుతున్న లాక్ డౌన్ జీవితం ఒక విచిత్రమైన జ్ఞాపకంగా అందరి జీవితాలలోను మిగిలిపోతుంది. స్వతహాగా సున్నిత మనస్కుడైన కొరటాల శివ ఆలోచనల పై కూడ ఈ లాక్ డౌన్ జీవితం ఒక ఊహించని ప్రభావాన్ని చూపెడుతోంది. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల తన లాక్ డౌన్ జీవితం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు. 


జీవితంలో రేసులు ఖంగారులు లేవనీ తెల్లవారిన తరువాత ఎవరికి వారు ఎదో ఒకపని కల్పించుకుంటున్నారు తప్ప ఎవరికీ స్పష్టమైన పనిలేదనీ దీనితో ప్రతి మనిషి తమతమ స్థాయిలలో ఆలోచించుకునే సమయం ఎక్కువైపోయిందని ఇలాంటి జీవితం తనకు ఏర్పడుతుంది అని తాను కలలో కూడ ఊహించుకోలేదు అంటూ కామెంట్స్ చేసాడు. తన ఇంటిలో ఉండే వ్యక్తిగత సహాయకులు అందర్నీ రెండు నెలల జీతం ఇచ్చి పంపించేసిన తరువాత తమ ఇంటిలోని పనులను తామే చేసుకుంటున్నామని చెపుతూ పుస్తకాలు చదవడం సినిమాలు చూడటం సాయంత్రం తన అపార్ట్మెంట్ కిందకు వెళ్ళి వాక్ చేయడం తప్ప ప్రస్తుతం తనకేమీ పనులు లేవు అంటూ కామెంట్ చేసాడు. 


ఇదే సందర్భంలో ‘ఆచార్య’ మూవీలో ఇప్పటికీ రామ్ చరణ్ నటించాలని కోరుకుంటున్నారా అంటూ అడిగిన ప్రశ్నకు కొరటాల విభిన్నంగా స్పందించాడు. కరోనా తరువాత ఏసినిమా ఏమిటి అన్నది ఎవరికీ తెలియదనీ ఇప్పుడు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెపుతూ కరోనా తరువాత జనం ప్రాధాన్యతలు ఎలా మారిపోతాయో తమ ఊహకు కూడ అందడం లేదు అంటూ కామెంట్స్ చేసాడు.


తనకు వయస్సు అయిపోతోంది అన్న నిజం ఈ లాక్ డౌన్ పిరియడ్ గుర్తుకు చేసింది అంటూ తాను ఇక ఎక్కువ కాలం సినిమా రంగంలో ఉండలేను కాబట్టి మరిన్ని మంచి సినిమాలు తీయాలి అన్న కోరిక ఉందని చెపుతూ కరోనా శాంతించాలని తాను కూడ ఎదురు చూస్తున్నాను అంటూ మళ్ళీ జీవితం ఎలిమెంట్రీ స్కూల్ నుండి మొదలుపెడితే బాగుండును అంటూ తనలోని వేదాంత ధోరణిని బయట పెట్టాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: