ప్ర‌భాస్ ఈ పేరు ఒక్క తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే కాదు భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే ఒక ప్ర‌భంజ‌నం. ఒక ప్రాంతీయ హీరోగా ముద్ర ప‌డి త‌ర్వాత ఒక నేష‌న‌ల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్ర‌భాస్‌. కృష్ణంరాజు వార‌స‌త్వంగా  ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి యంగ్ రెబ‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. వ‌ర్షం చిత్రంతో ప్ర‌భాస్ కెరియ‌ర్‌లో ముందుగా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆర‌డుగుల ఆజానుబాహుడు ప్ర‌భాస్ అదేరేంజ్ గోపిచంద్ విల‌నిజ‌మ్‌లో గ‌ట్టిపోటీ ఇవ్వ‌డంతో ఈ చిత్రం ప్ర‌భాస్‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకువ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ ఛ‌త్ర‌ప‌తి కూడా రికార్డుల మోత మోగించింది. బిల్లా సినిమాలో తొలి సారి ద్వాపాత్రాభిన‌యం చేశారు. పెద్ద‌డాన్‌గా, చిల్ల‌ర దొంగ‌ల ఆ చిత్రంలో న‌టించి మాస్ ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు.  డార్లింగ్ చిత్రంలో తొలిసారిగా ఒక క్లాస్ రోల్‌లో న‌టించాడు ప్ర‌భాస్‌.  ఆ త‌ర్వాత వ‌చ్చిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ చిత్రం కూడా డార్లింగ్ కంటే పెద్ద విజ‌యాన్నే సంపాదించింది.

 

ఇక మిర్చి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మ‌ళ్ళీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఆ  త‌ర్వాత ప్ర‌భాస్ బాహుబ‌లి డేట్స్ అన్ని రాజ‌మౌళికి అప్ప‌జెప్పేసి సుదీర్ఘంగా బాహుబ‌లి చిత్రంలో న‌టించాఉ. రాత్రి ప‌గ‌లు, ఎండా వాన అనే తేడా లేకుండా ఆహ‌ర్నిశ‌లు ఆ చిత్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమా కోసం తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ ప్ర‌జ‌లు కూడా ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. ఈ చిత్రం ప్ర‌భాస్‌కి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్ర‌మ‌ని చెప్పాలి. ఈ చిత్రంతోనే ప్ర‌భాస్ నేష‌న‌ల్ హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో చిత్రంలో న‌టించాడు . ఆ చిత్రం కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి మంచి క‌లెక్ష‌న్ల‌ను క‌లెక్ట్ చేసింది.

 

ఇక ఇదిలా ఉంటే... ప్ర‌భాస్ వ్య‌క్తిగ‌తంగా చాలా రిజ‌ర్వ‌డ్‌గా ఉంటాడు. స్టేజ్ మీద పెద్ద‌గా మాట్లాడ‌డు. అలాగే ఇంత కాలం నుంచి ప్ర‌భాస్‌పైన పెద్ద‌గా కాంట్ర‌వ‌ర్సీలు కూడా ఏమీలేవు. ఆయ‌న హీరోయిన్స్‌తో కూడా సెట్స్‌లో చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తాడ‌ట‌. ఇక ఎవ‌రికైనా ఏమైనా స‌హాయం కావాలంటే అంద‌రికంటే ముందు ఉండేది ప్ర‌భాసే. ఇటీవ‌లె ఆయ‌న క‌రోనా స‌హాయ‌నిధి కోసం దాదాను నాలుగు కోట్లు దాకా విరాళాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: