అనుష్క... టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన హీరోయిన్. ఈమె తెలుగులో స్టార్ హీరో తో సమానం గా తనకు క్రేజ్ తెచ్చుకుంది. తన నటన తన అందం తో ఆమె ఒక ఊపు ఊపింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఆమె కాస్త ఇబ్బంది పడుతుంది. అరుంధతి లాంటి సినిమాను చేయడానికి ఆమె ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో తనకు ఉన్న ఫాన్స్ ని దృష్టి లో పెట్టుకుని ఒక భారీ సినిమాను చేయడానికి గానూ క్రిష్ తో ఆమె చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. తాను భారీగా పెట్టుబడి కూడా పెడతాను అని ఆమె చెప్పినట్టు సమాచారం. 

 

అందుకే ఇప్పుడు క్రిష్ కూడా ఆమె తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు క్రిష్. ఆ సినిమా తర్వాత ఆమె ఈ సినిమాను చెయ్యాలి అని భావిస్తుంది. ఆమె కు ఇప్పుడు ఒక మంచి హిట్ కావాలి అని హీరోల పక్కన ఇక నటించే అవసరం గాని ఆ అవకాశాలు గాని తనకు వచ్చే అవకాశం లేదని ఆమె భావిస్తుంది. అందుకే ఇప్పుడు ఆమె ఇలాంటి సినిమా చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. టాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు అనుష్క నుంచి మంచి సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. 

 

దాన్ని దృష్టి లో పెట్టుకుని ఆమె ప్రస్తుతం సినిమాలను చెయ్యాలి అని చూస్తుంది. ఆమె సినిమాల్లో భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వచ్చే అవకాశం లేదు కాబట్టి నిర్మాణ భారాన్ని తాను కూడా కూడా మొయ్యాలి కాస్త అనే భావనలో ఆమె ఉందని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్. ఆమె ప్రస్తుతం హీరోలతో ఆఫర్లు వచ్చినా సరే చేయడం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: