టాలీవుడ్ లో ఇప్పుడు కీలక దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన సినిమాలు అంటే చాలు ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసే జనాలు కూడా ఉంటారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు కాస్త డిమాండ్ కూడా పెరిగింది. అగ్ర హీరోలు నిర్మాతలు ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిన్న నిర్మాతలు అయితే ఆయన తో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక అగ్ర దర్శకులు అయితే త్రివిక్రమ్ సినిమాలో భారీగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆయన కోసం మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు పోటీ పడుతున్నారు. దీంతో తన డిమాండ్ ని దృష్టి లో పెట్టుకుని మహేష్ బాబు లాంటి హీరోల తో సినిమా చేస్తే మాత్రం దాదాపు 60 కోట్ల వరకు ఏదోక రూపంలో ఆయన తీసుకోవాలని భావిస్తున్నారు. పారితోషికం కాకుండా ఇతర రూపాల్లో ఆయన వసూలు చెయ్యాలి అని చూస్తున్నారు. ఎలాంటి సినిమా అయినా సరే ఆయన ఇప్పుడు కాస్త రేటు పెంచే యోచనలోనే ఉన్నారు. చిన్న చిన్న హీరోలతో సినిమా చేసే అవకాశం లేదు కాబట్టి పెద్ద హీరోల తో సినిమా అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించి రేటు ఫిక్స్ చెయ్యాలి అని చూస్తున్నారని టాలీవుడ్ లో ఇప్పుడు వ్యాఖ్యలు వినపడుతున్నాయి .

 

ఆయన సినిమాలకు కమర్షియల్ గుర్తింపు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: