టాలీవుడ్ లో కమర్షియల్ దర్శకులు కొరటాల శివ. ఆయన తో సినిమా చేయడానికి గానూ ఇప్పుడు ఎందరో హీరోలు నిర్మాతలు పోటీ పడే పరిస్థితి మన తెలుగులో ఉందీ అనే సంగతి తెలిసిందే. చిరంజీవి కూడా ఆయన తో సినిమా చేయడానికి పోటీ పడి కథ నచ్చడం తో వెంట పడి మరీ సినిమా చేసిన పరిస్థితి మన౦ చూసాం. మన తెలుగు లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న దర్శకుడు కొరటాల శివ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఆయన సినిమాలకు ఇంకా క్రేజ్ పెరిగింది. ఇక తమిళంలో కూడా ఆయనా సినిమాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. 

 

ఇప్పుడు కొరటాల శివ సినిమాలను అక్కడ కొనుగోలు చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. ఆయన సినిమాలు అన్నీ దాదాపుగా హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఇక్కడ ఆయన సినిమాలను కొనుగోలు చేసి అక్కడ సినిమాలను అగ్ర హీరోలతో చెయ్యాలి అనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది స్పష్టంగా తెలియదు గాని ఆయన చేసిన శ్రీమంతుడు సినిమాను బాలీవుడ్ లో కూడా చెయ్యాలి అని చూసినట్టు సమాచారం. ఇక ఆయన చేస్తున్న సినిమాల మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారట. 

 

సినిమాలు కమర్షియల్ కోణం లో ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆయన సినిమాల మీద బాలీవుడ్ కోలీవుడ్ దృష్టి పెట్టింది అంటున్నారు. ఆయన ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఆచార్య సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తారు. ఈ సినిమా షూటింగ్ కాస్త పూర్తి అయింది కూడా. ఇక టైటిల్ కూడా దాదాపుగా ఆచార్య అనే టాక్ వినపడుతుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఏంటీ అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: