టాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ కి మంచి డిమాండ్ ఉందీ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అతని తో సినిమాలు చేయడానికి గానూ ఇప్పుడు అగ్రధర్శకులు కూడా పోటీ పడే పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నారు; ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఆయనకు మంచి క్రేజ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అతని సినిమాల మీద ఇతర భాషల్లో అగ్ర దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

అగ్ర దర్శకులు ఇప్పుడు అతని తో సినిమా చేయడానికి చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. తమిళ స్టార్ దర్శకుడు శంకర్... ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా భారతీయుడు సినిమా ఆగిపోయిన నేపధ్యంలో ఇప్పుడు మన తెలుగులో సినిమా చేయడానికి అతను ఆసక్తి చూపిస్తున్నాడు. ఇండియన్ 2 సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

 

అది కేసులు అన్నీ పూర్తి చేసుకుని సినిమా మొదలు కావాలి అంటే ఏడాది వరకు సమయం పడుతుంది. అప్పటికి కూడా అది పూర్తి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేసులు అంటే కోర్టులు, ఇతరత్రా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ గ్యాప్ లో తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమా చెయ్యాలి అని చూస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఆగినట్టు సమాచారం. ఆ కథ కూడా ఉందని త్వరలోనే ఆ కథను రామ్ చరణ్ కి వినిపించి సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: