'Rx 100' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ చిత్ర విజయంతో ఎక్కడికో వెళ్ళుపోతుందనుకున్న పాయల్ కు నిరాశే ఎదురైంది. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు 'RDX 100' లాంటి చిన్న చిన్న చిత్రాలలో నటించే అవకాశం మాత్రమే దక్కింది. 'RDX 100' సినిమాలో 'Rx 100' ని మించి అందాలను ఆరబోసినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది. అలాంటి టైంలో అనుకోకుండా వెంకీతో నటించే అవకాశం 'వెంకీమామ' సినిమా రూపంలో అమ్మడి తలుపు తట్టింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనైనా టాలీవుడ్ లో పాగా వేద్దామనుకున్న ఈ భామను మళ్ళీ నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో తన నటనకు మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాలో నటించినప్పటికీ మళ్ళీ పరాజయం పలకరించింది.

 

IHG

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కాలం కలిసి రాక.. అవగాహనా రాహిత్యం కారణంగా చిన్న సినిమాలకు.. సీనియర్ హీరోల పక్కన సెకెండ్ లీడ్ కే మాత్రం పరిమితం అయిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఈ మధ్య ఆ ఛాన్స్ లు కూడా మిస్ అవుతున్నాయి. మొదట బాలయ్యబోయపాటి సినిమాలో పాయల్ ను బాలయ్యకు జోడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కొత్త హీరోయిన్ కే ఆ ఛాన్స్ వెళ్ళిపోయింది. బాలయ్య సినిమాలో ఛాన్స్ ఎందుకు మిస్ అయిందో పాయల్ కే తెలియాలి. తన బోల్డ్ నెస్ గ్లామర్ తో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నా చివరకు ఆమెకు మాత్రం ఒరిగిందేమి లేదు. పోనీ చిన్న హీరోల పక్కన అన్నా మెయిన్ లీడ్ వస్తున్నాయా అంటే ప్రెజెంట్ అలాంటి క్యారెక్టర్స్ కూడా మిస్ అవుతున్నాయి. తాను ఒకటి తలస్తే దైవం మరొకటి తలచిందని సామెత ఈ అమ్మడి కెరీర్ కి బాగా సెట్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: