అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో హిట్టు కొట్టలేదు కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. పాతిక సినిమాల కెరియర్ లో పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన పవన్ కళ్యాణ్ కొన్నిటిలో వీక్ అని మాత్రం చెప్పొచ్చు. అదేంటి అంటే పవర్ స్టార్ రేంజ్ ఉన్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రొమాన్స్ అంటే మాత్రం ఆమడదూరం జరుగుతాడు. 25 సినిమాల్లో ఆయన హీరోయిన్ ను టచ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇక రొమాంటిక్ సీన్స్ అయితే చాలా అరుదు. 


మిగతా హీరోలు రొమాన్స్ లో చాలా దూరం వెళ్తుంటే పవన్ మాత్రం రొమాన్స్ కు నై తినేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ డ్యాన్స్ విషయంలో కూడా చాలా వెనుకపడ్డాడు. తన డైన స్టైల్ తో మెప్పించడమే తప్ప డ్యాన్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు పవన్. మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చుగా అంటే అది నా వల్ల కాదని చెప్పేస్తాడు తప్ప ట్రై కూడా చేయదు. పవన్ సినిమా అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే వస్తాయి. అతని బొమ్మ కనబడితే చాలు ఇక మాకు ఏమి అక్కర్లేదు అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే పవన్ కూడా ఎక్కువ రిస్క్ చేయడు. 


పవన్ కళ్యాణ్ కూడా డ్యాన్సులు, రొమాన్స్ చేస్తే ఆయన రేంజ్ మరోలా ఉండేది. ఇప్పటికి పవన్ సినిమా ప్లాప్ అయినా సరే వసూళ్ల బీభతం సృష్టిస్తుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ వరుసగా మూడు నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ బాక్సాఫీస్ మీద తన సత్తా చాటేలా ఉన్నాడని చెప్పొచ్చు. వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్.. క్రిష్ తో వెరైటీ కాన్సెప్ట్ మోయీ.. హరీష్ శంకర్ తో క్రేజీ మూవీ ఇలా అన్ని అంచనాలు పెంచే సినిమాలే కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: