నటిగా మంచి పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి . గ్యాంగ్ లీడర్, భారత రత్న, కర్తవ్యం మరియు రాములమ్మ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి. రాజకీయాలలోకి వెళ్లిన తర్వాతో సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరూ ..సినిమాతో మనముందుకు మరోమారు వచ్చారు..అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే రాజకీల్లో బిజీగా ఉన్నందున మళ్లీ సినిమాలను చేసే అవకాశం చాల తక్కువ. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో లాక్ అయిపోయిన సినీ స్టార్స్ తమ  ఉనికిని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. విజయశాంతి  ఇంట్లోనే ఉంటూ పాతసినిమా లను చూస్తూ ఆ నాటి నట సార్వభౌములు స్మరిస్తూ  తన ట్విట్టర్ ఖాతాలో ఎంతో భావోద్వేగంతో తన మధురమైన భావాలను పంచుకున్నారు.  

 తన ట్విట్టర్ ఖాతా లో ఇలా ట్వీట్ చేశారు "కొంత విరామంతో కొనసాగుతున్న ప్రస్తుత లాక్‌డౌన్ పరిణామం నాలో కలిగించిన ఒక ఉద్వేగభరిత భావంతో మన తెలుగు నటీమణుల, నటప్రవీణుల విద్వత్తు, ప్రతిభల సమున్నతను స్మరిస్తున్న సందర్భం ఇది. అత్యున్నత స్థాయికి చెందిన మన తెలుగు చిత్రాలను గతంలో ఎన్నోసార్లు చూసినప్పటికీ మళ్ళీ చూసే అవకాశం లభించింది." అని తన మధురమైన స్మృతులను పంచు కున్నారు ఆమె...

మరింత సమాచారం తెలుసుకోండి: