జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటూ... కోవిడ్ 19 నివారణ కొరకై కృషి చేస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. ఆయన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది జనసేన పార్టీ కార్యకర్తలు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణంగా పేద ప్రజలు అన్నం తింటున్నారు. అందుకుగాను మనం కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాల్సిందే.


తాజాగా గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి లతో పాటు సింగర్ మేఘా రాజ్, ఎడిటర్ వేణు అందరూ కలసి కరోనా వైరస్ పై ర్యాప్ సాంగ్ క్రియేట్ చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నటులతో పాటు సింగర్ మేఘా రాజ్, ఎడిటర్ వేణు లకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఈ ర్యాప్ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీత బాణీలు అందించగా... పాటను ప్రియాంక రాశారు. వీళ్లిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు పవన్ కళ్యాణ్.


ఇకపోతే ఈ పాట విడుదలై ఐదు రోజులు కావస్తుండగా ఇప్పటివరకు 26వేల వీక్షణలు వచ్చాయి. ఏదేమైనా రాంగోపాల్ వర్మ కనిపించని పురుగు అని కరోనా పై పాడిన పాట 12 లక్షల వీక్షణలను పొంది సంచనలం సృష్టించింది. ఇప్పటికే కరోనా పై ఎంతో మంది కళాకారులు పాటలు రాయగా... వాటిలో ప్రజల్లోకి వెళ్లిన పాటలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఏం పిల్లో ఎల్దామొస్తవా అనే పాట తో అప్పట్లో ఒక ఊపు ఊపిన వంగపండు ప్రసాదరావు 'జజ్జనకరి కరోనా చూడరా దాని ఘరానా' అంటూ తాజాగా జానపద పాట పాడారు కానీ దానికి ఆదరణ లభించక పోవడం బాధాకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: