తెలుగు సినిమాల్లో పాటలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమాల్లో పాటలు లేకుండా తీసే దర్శకులు చాలా తక్కువ. ప్రేక్షకులని ఒకే మూడ్ లో మూడు గంటలు కూర్చొబెట్టడం కంటే, అందులో పాటల్ని పెట్టడం మంచిదని అనుకుంటారు. అంతేకాదు సీన్ల ద్వారా చెప్పలేని విషయాలని పాటల ద్వారా చాలా ఈజీగా చెప్పవచ్చు. అందుకే తెలుగు సినిమాల్లో పాటలు చాలా ముఖ్యం అయ్యాయి.

 

అయితే ఒకప్పటి పాటల్లో డాన్స్ చాలా తక్కువగా ఉండేది. సాహిత్యానికి తగినట్టుగా దర్శకులు తెరమీద చిత్రీకరించేవారు. అయితే చిరంజీవి బ్రేక్ డాన్సులతో వెండితెరని షేక్ చేస్తుంటే విపరీతమైన డాన్సులకి విపరితమైన ఆదరణ పెరిగింది. దాంతో చాలా మంది హీరోయిన్లు తమకి డాన్సు రాకపోయినా పాటలకి డాన్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాన్స్ లో కొంచెం వీక్ అనే చెప్పాలి.

 


కానీ ఈ విషయం ఆయన అభిమానులతో అంటే ఒప్పుకోరు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో డాన్స్ చేసే పాటలు చాలా తక్కువగా ఉంటాయి. పాటకి డాన్స్ చేసే బదులు కాన్సెప్ట్ బేస్డ్ తో పోవడానికే పవన్ ఇష్టపడతాడు. అందుకే పవన్ కళ్యాణ్ పాటల్లో చాలా భాగం కాన్సెప్ట్ బేస్డ్ గానే ఉంటాయి. అప్పటి వరకు ఎవరూ ఇలా ట్రై చేయకపోవడం విచిత్రమనే చెప్పాలి. బద్రిలో మిస్సమ్మ , మిస్సమ్మా పాట అయితేనేమి, తమ్ముడులోని చాలా పాటలు ఇలాగే ఉంటాయి.

 

అందుకే ఇప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. తొలిప్రేమలో కూడా ఇంతే. పాటలని డాన్సులతో నింపేసి రొటీన్ కి వెళ్లకుండా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచాడు. అయితే పవన్ కళ్యాణ్ వేసే చిన్న చిన్న స్టెప్స్ కూడా అభిమానులకి మంచి ఊపునిస్తాయి. గోపాల, గోపాల, కాటమరాయుడు సినిమాల్లో వీటిని మనం చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: