టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ అయిన వారు అతి కొద్ది మంది ఉన్నారు.  అందులో హరీష్ శంకర్ ఒకరు.  పవన్ కళ్యాన్ తో మనోడు గబ్బర్ సింగ్ మూవీ తీశాడు. అప్పటి నుంచి హరీష్ శంకర్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  మరోసారి పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తుందని ఎదురు చూశారు.. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు.  ప్రస్తుతం పవన్ కళ్యాన్ వరుస బెట్టి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తో ఓ మూవీ తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. ప్రస్తుతం పవన్ కి తగ్గ కథ ఆయన రెడీ చెసుకుంటున్నారట.  

 

మెగాహీరో వరుణ్ తేజ్‌ కథానాయకుడిగా `గద్దలకొండ గణేష్` సినిమా రూపొందించి హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `పవన్‌కల్యాణ్ గారిని నేనెప్పడూ ఓ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడను. ఓ అభిమానిగానే చూస్తాను. అందుకే ఆయన అభిమానులకు నచ్చే విధంగా పవన్ మూవీ తీయాలని కోరిక అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాని అని చెప్పిన ఆయ‌న త్వ‌ర‌లో వెబ్ సిరీస్‌తో పాటు యువ నిర్మాతలైన మహేష్ ఎస్ కోనేరు, బన్నీ వాసులతో కలిసి సినిమా నిర్మాణం కూడా చేపట్టబోతున్నట్లు చెప్పారు.  

 

కాగా,  సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు అనే మూవీతో బాక్సాఫీస్ విజయం అందుకున్నాడు.  ప్రస్తతుం   ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  మొత్తానికి హరీష్ శంకర్ టాప్ హీరోలను వరుసగా లైన్లో పెడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: