కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో దేశంలోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇందుకు సినీ సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాలేదు. వారంతా ఇళ్లలోనే ఉండి తమ సినిమాలకు సంబంధించిన పనులు చేసుకుంటున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా తన ఆర్ఆర్ఆర్ సినిమా పనులను ఇంట్లోనే ఉండి చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చాడు.

 

 

ఎన్టీఆర్ గురించి చెప్తూ.. ‘స్టూడెంట్ నెంబర్ వన్ సమయంలో ఎన్టీఆర్ ను చూసి తనకు ఇలాంటి హీరో దొరికాడేంటి అనుకున్నాను. అప్పటికి ఎన్టీఆర్ కు 19ఏళ్ల వయసుండొచ్చు. నూనుగు మీసాలతో ఉన్న ఎన్టీఆర్ తో అయిష్టంగానే సినిమా మొదలు పెట్టాను. సినిమా షూటింగ్ లో సీన్, సీన్ కు ఎన్టీఆర్ లో ఉన్న ఎనర్జీ మారిపోతూ వచ్చింది. ఫేస్ ను బట్టి కాదు మనిషి లోపల ఉన్న టాలెంట్ ను చూడాలని ఎన్టీఆర్ ఫెర్మార్మెన్స్ చూశాక అర్ధమైంది’ అన్నాడు. రామ్ చరణ్ గురించి చెప్తూ.. ‘మగధీర మొదటి షాట్ లో రాణిని చూసి బాధతో ఒక డ్రమ్ కు ఆనుకుని పడిపోయే సీన్ లో రామ్ చరణ్ ఎక్స్ ప్రెషన్ నన్ను మైమరిపించింది. తనలో అద్భుత నటుడిని ఆ క్షణంలో చూశాను’ అన్నాడు.

 

 

ప్రభాస్ గురించి చెప్తూ.. ‘ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం మా పర్సనల్ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకునేంత చనువు ఉంది. ప్రభాస్ మాట్లాడుతుంటే వెర్రి వాగుడులా అనిపిస్తుంది కానీ.. తన మాటల్లోని మర్మం, మనసులోని అంతరంగం వేరు. మనసులోంచి వచ్చే ప్రభాస్ మాటల్లో ఎంతో పరిపక్వతతో ఉంటాయి’ అన్నాడు. వీరు ముగ్గురే కాకుండా మిగిలిన హీరోలు కూడా తనకు స్నేహితులే అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: