లాక్ డౌన్ తో   సినిమా నిర్మాణం పై ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది.  నిర్మాతలకు బడ్జెట్ పరంగా పెద్ద దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే స్టార్ట్ చేసిన సినిమాలు.. స్టార్ట్ చేయడానికి ఫైనాన్స్ తీసుకున్న నిర్మాతలకు కోలుకోలేనిది కరోనా లాక్ డౌన్ దెబ్బ.  ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పెద్ద చిన్న సినిమాల పరిస్థితి మరీ భయంకరంగా మారబోతోంది. ఈ టైమ్ లో ఫైనాన్స్ పుట్టే అవకాశం ఉండదు. అసలే నష్టపోతున్న పెద్ద సంస్థలు ఏవీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం లేదు. దాంతో సినిమాలు స్టార్ట్ చేసిన వారు చేయాలి అనుకున్న వారు నిండా మునగక తప్పదనే చెప్పాలి.

 

ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాలు నిర్మిస్తున్నది టాలీవుడ్ లోనే. అయితే ఇందులో ఇప్పటికే ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. కొన్ని సినిమాలు స్టార్టింగ్ దశలో ఉన్నాయి.. ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ లపై భారం పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలపై ఆర్ధికమాంద్యం ప్రభావంతో ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ఇంకా లేట్ గాసినిమాలు రావచ్చు. ఎలాగు ఇందులోచాలా సినిమాలు నెక్ట్స్ ఇయర్ టార్గెట్ గా రూపొందుతున్నాయి.. ఈ ఇయర్ లో రిలీజ్ చేయాలనుకున్నస్రభాస్ జాన్, పూరీ-విజయ్ ఫైటర్, అల్లు అర్జున్ పుష్ప లాంటి మూవీస్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

 

లాక్ డౌన్ వల్ల  ఆర్ధిక మాంద్యం దెబ్బ సినిమా పై ఎక్కువగా ఉండబోతోంది. ఈ పరిస్థితి ఎక్కువగా చిన్న సినిమాలపై గట్టిగా చూపిసంచబోతోంది. ఇండస్ట్రీలో ఎక్కువ మంది చిన్న సినిమాలపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. వారి జీవనాధారం కూడా దెబ్బతినే పరిస్థితి రాబోతుంది. ఇక ప్రభుత్వం కూడా ఆర్ధిక మాంద్యాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. అయితే సినిమా నిర్మాణాల విషయంలో.. నిర్మాతలు.. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం నుంచి రాయితీలు అడిగే అవకాశం కనిపిస్తోంది.

 

మరోవైపు మూవీ మేకర్స్ కు ఓవర్ సిస్ దెబ్బ కూడా గట్టిగానే తగిలేలా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కరోనా ప్రభావం ఈ ఇయర్ అంతా కనిపించేలా ఉంది. అమెరికా,చైనా,ఇటలీ లాంటి దేశాలలో ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రపంచ సినిమాకు 40 వేల కోట్లకు పైన నష్టమని అంచనాలున్నాయి. అయితే మన సినిమాలకు ఓవర్ సిస్ లో మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడున్న పరిస్థితితో ఓవర్ సిస్ మార్కెట్ క్లోజ్ అయ్యింది. ఇప్పుట్లో ఓవర్ సిస్ తలుపులు తెరుచుకునే అవకాశం లేకపోవడం కూడా మన సినిమాకు పెద్ద  దెబ్బ అనే చెప్పాలి. దాంతో ప్రొడ్యూసర్లకు కలెక్షన్లు రాక  నిండామునిగే పరిస్తితేకనిపిస్తోందంటున్నారు టాలీవుడ్ జనాలు . మరి ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: