ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి రెండు భాగాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రౌద్రం రణం రుధిరం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో దానిని వేగంగా నివారించేందుకు మన దేశాన్ని మే 3 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

కాగా దానితో పలు రంగాలన్నిటితో పాటు సినిమా రంగం కూడా మూతబడింది. సినిమా షూటింగ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ నింపుదల చేయడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే తమ సినిమాకు సంబంధించి ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోందని, ఈ సినిమాకు సంబంధించి పని చేస్తున్న స్టూడియోల వారు దానిని వర్క్ ఫ్రమ్ చేస్తున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో వీడియో కాల్ లో ముచ్చటిస్తూ చెప్పారు రాజమౌళి. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ వీడియో కు ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

 

ఇక గత సినిమాలైన బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరువలేనిదని, నిజానికి అతడితో ఛత్రపతి సినిమాకు పని చేసినప్పటితో పోలిస్తే ప్రభాస్ లో మరింత పరిణితి పెరిగిందని అన్నారు. కాగా చూడడానికి ఎంతో సైలెంట్ గా, రిజర్వుడ్ పర్సన్ గా కనపడే ప్రభాస్, మనతో మాట్లాడుతున్నపుడు చాలా అమాయకుడిగా, వెర్రిబాగులోడిగా అనిపిస్తాడని, అయితే అతడి అసలు మనస్తత్వం తనతో చనువుగా ఉండేవారికి మాత్రమే తెలుసునని అన్నారు. ప్రభాస్ ఒక గొప్ప ఫిలాసఫర్ అని, ఎటువంటి పరిస్థితిని అయినా అర్ధం చేసుకుని నడుచుకునే మనిషి అని, అలానే అతడి యాక్టింగ్ స్కిల్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని రాజమౌళి చెప్పారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: