టాలీవుడ్ లో ఇప్పుడు మెగా హీరోల హవా అనేది నడుస్తుంది. సినిమా సినిమాకు ఆ ఫ్యామిలీ హీరోలకు క్రేజ్ అనేది పెరుగుతుంది అనే మాట వాస్తవం. అందుకే ఇప్పుడు వారి తో సినిమాలను చేయడానికి నిర్మాతలు దర్శకులు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల కోసం అయితే ఫాన్స్ కూడా ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ లో చిరంజీవి నుంచి ప్రతీ ఒక్కరు కూడా వరుసగా సినిమాలను చేస్తున్నారు. చిరంజీవి చేతిలో రెండు సినిమాలు రామ్ చరణ్, అల్లు అర్జున్ చేతిలో ఒక్కో సినిమా ఉన్నాయి. 

 

ఇక మిగిలిన హీరోల చేతుల్లో కూడా ఒక్కో సినిమా ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు మెగా హీరోలతో కథ బాగుంది తనకు నచ్చింది అనుకుంటే తానే సినిమా చేయడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నట్టు సమాచారం. కథను వేరే వాళ్లకు ఇవ్వకుండా తానే ముందు విని మెగా హీరోల సినిమాలను తానే చెయ్యాలి అని భావిస్తున్నారు ఆయన. ప్రస్తుతం ఎక్కువ సినిమాలను తానే మెగా ఫ్యామిలీ లో చేయ్య్యాలి అని అవసరం అనుకుంటే వేరే నిర్మాతను కలుపుకుని పోవాలి అని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 

 

చిరంజీవి సినిమాలు ఎలాగూ రామ్ చరణ్ చేస్తున్నాడు. మిగిలిన సినిమాలను తాను చెయ్యాలి అని చూస్తున్నట్టు చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. కథ ముందు తాను విన్న తర్వాతే హీరో కి వినిపించే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు దర్శకులకు ఆయన ఇదే విషయం స్పష్టంగా చెప్పారట. చిరంజీవి సినిమాల్లో తాను పెట్టుబడి పెట్టాలి అని కూడా భావిస్తున్నా సరే రామ్ చరణ్ అడ్డు పడటం తో ఆయన ఆ సినిమాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టలేక పోతున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఇది నిజమో కాదో.

మరింత సమాచారం తెలుసుకోండి: