మన తెలుగులో సినిమాలు అనగానే బాలీవుడ్ జనానికి కూడా ఆసక్తి ఉంటుంది. చిన్న చిన్న సినిమాలను పెద్దగా పట్టించుకోకపోయినా సరే పెద్ద పెద్ద సినిమాల మీద మాత్రం బాగానే దృష్టి పెడుతూ ఉంటారు. టాలీవుడ్ హీరోల సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ కూడా ఉంది. మన తెలుగు సినిమాలను అక్కడ రీమేక్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు జనాలు. చిన్న చిన్న సినిమాలు కూడా కథ నచ్చింది అంటే చాలు బాలీవుడ్ లో చేయడానికి గానూ జనాలకు మంచి ఆసక్తి ఉంటుంది అక్కడ. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలను తమిళ సినిమా చిన్న చూపు చూస్తుంది అంటున్నారు. దీనికి కారణం నిర్మాతలే అని అంటున్నారు. కమర్షియల్ మార్కెట్ కోసం అక్కడి హీరోలను మన తెలుగు సినిమాల్లోకి విలన్ గా సహా ఇతర పాత్రల కోసం ఎంపిక చేస్తూ వస్తున్నారు. దీన్ని చూసి అక్కడి ఫాన్స్ సహా కొందరు మన తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మన తెలుగు సినిమాలను ఒకప్పుడు బాగున్నాయి అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు అక్కడ చిన్న చూపు చూస్తున్నారు. 

 

అక్కడి అగ్ర హీరోలకు మన తెలుగులో డిమాండ్ ఉన్నా సరే మన తెలుగు హీరోలకు అక్కడ డిమాండ్ ఉండటం లేదు. మరి దీనికి స్పష్టమైన కారణం ఏంటీ అనేది తెలియకపోయినా మన తెలుగు సినిమాలు వాళ్ళ మీద ఆధారపడుతున్నాయి అనే భావంలో వాళ్ళు ఉండటమే అని అంటున్నారు. చిన్న చిన్న హీరోల కు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా హడావుడి చేయడమే తెలుగు సినిమాలకు అక్కడ విలువ తగ్గడాని కి ప్రధాన కారణమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంత హడావుడి అవసరం లేదని పలువురు సూచనలు చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: