టాలీవుడ్ లో ఒకప్పుడు రవి తేజా తో సినిమా అనగానే దర్శక నిర్మాతలకు ఒక రకమైన ఆసక్తి అంటూ ఉండేది. దానికి కారణం ఏంటీ అనేది అందరికి తెలిసిన విషయమే. కథ బాగుంటే చాలు అతని తో సినిమా చేస్తే సూపర్ హిట్ అవుతుంది అనే భావన అప్పుడు నిర్మాతలు దర్శకుల్లో ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు ఏమైందో ఏమో గాని అతని తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకి రావడం లేదు. రవి తేజా ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఏ సినిమా కూడా దూకుడుగా చేస్తున్న సందర్భం లేదు. 

 

ఈ మధ్య కాలంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా అతను సరైన హిట్ అనేది అందుకోలేదు అనేది వాస్తవం. అతని సినిమాల కోసం ఎదురు చూసే అభిమానులు కూడా చూడటం దాదాపుగా మానేశారు అనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే  ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే అతని తో సినిమా చెయ్యాలి అంటే నిర్మాతలు భయపడుతున్నారని టాలీవుడ్ వర్గాలు ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాయి. అతని తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించిన వాళ్ళే... ఇప్పుడు వద్దని అంటున్నారు. 

 

అతని సినిమాలకు గతంలో మార్కెట్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు అసలు ఏ మార్కెట్ కూడా జరగడం లేదు. అతని సినిమా హక్కుల కోసం ఎవరూ కూడా ముందుకు రావడం లేదు కూడా. ఇక నిర్మాతల ముందు కొన్ని కొన్ని సమస్యలు ఉంటున్నాయి. థియేటర్ లు కూడా ఎవరూ ఒప్పుకోవడం లేదని సమాచారం. ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా పెద్దగా ఎవరూ కూడా థియేటర్ ఇవ్వడానికి ముందుకి రావడం లేదని టాలీవుడ్ వర్గాల సమాచారం. అందుకే అతని తో సినిమా చెయ్యాలి అంటే నిర్మాతలు భయపడుతున్నారని అంటున్నారు టాలీవుడ్ జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: