కరోనా సెలవులను పూజా హెగ్డే ఇప్పటి వరకు రకరకాలుగా ఎంజాయ్ చేస్తోంది. ఏం చేయాలో తెలియక.. కెమెరాకు గ్లామర్ ఫోజులిచ్చింది. ఈ అమ్మడు పెట్టిన ఫోటో.. నెట్ లో వైరల్ అయింది. చిట్టిపొట్టి డ్రస్సుతో కనిపించిన పూజాకు ఫ్యాన్స్ లైకులు మీద లైకులు కొడుతున్నారు. 

 

కరోనా హాలిడేస్ ను ఒక్కొక్కరూ ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. వంట వార్పు మీద కొందరు శ్రద్ధపెడితే.. మరికొందరు ఫిట్ నెస్ లో బిజీగా గడిపేస్తున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ.. శ్రమదానం చేస్తున్నారు ఇంకొందరు. పూజా వీటన్నింటినీ రౌండప్ చేసేసింది. 

 

కరోనా హాలిడేస్ లో గ్లామర్ ఒలకబోయడం స్టార్ హీరోయిన్స్ కు కూడా పాకింది. నిన్నటి వరకు ఇస్మార్ట్ భామలు నిధి అగర్వాల్.. నభ నటేశ్ సోషల్ మీడియాను హీటెక్కించారు. రీసెంట్ గా శృతిహాసన్ కూడా ఈ గ్లామర్ కూటమిలో జాయిన్ అయింది. 

 

కరోనా సెలవుల్ని రకరకాలుగా ఎంజాయ్ చేస్తోంది పూజా హెగ్డే. పూజా హెగ్డే.. హల్వా తయారు చేయడంలో మొదలుపెట్టి.. ఆ తర్వాత తినే స్టిల్ ను పోస్ట్ చేసింది. తిన్నదంతా కొవ్వుగా చేరకముందే.. ఫిట్ నెస్ స్టిల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రధాని పిలుపు మేరకు దీపాలు పెట్టింది. ఆ మధ్య గిటార్ వాయిస్తున్న స్టిల్ తో ఆకట్టుకోగా.. చివరకు గ్లామర్ వైపు అడుగులు వేయడం స్టార్ చేసింది పూజా. మున్ముందు డోస్ పెంచి.. సినిమాల్లో కంటే.. ఇన్ స్టా గ్రామ్ ను హీట్ ఎక్కిస్తుందేమో. 

మొత్తానికి పూజా హెగ్డే కరోనా హాలిడేస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. రకరకాల ఫోటో షూట్ లు చేసి కుర్రకారులో హీట్ ఎక్కించేస్తోంది. ఇక ముందు ఎలాంటి ఫోటోలు వస్తాయో ఏమో అని యూత్ అంతా తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే మాత్రం ఎక్కడా ఆగడం లేదు. తెగ రెచ్చిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: