కరోనా మహమ్మారితో అన్ని వ్యాపార సంస్థలు, చిత్ర పరిశ్రమలు కుదేలయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు కోలుకుంటాయో చెప్పడం ఎవరి వల్లా కావడం లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలు ఎప్పుడు దారికొస్తాయో సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో అర్థం కాని పరిస్థితి. మళ్లీ టాలీవుడ్ ఎప్పుడు కళకళలాడుతుంది? అన్నదైతే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పటి లాగే కళ రావాలంటే షూటింగ్ లు ప్రారంభం కావాలి...అలాగే థియేటర్లు ఓపెన్ కావాలి. థియేటర్లు ఓపెన్ అయితే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, థియేటర్ కార్మికులు ..ఇలా అందరికీ ఉన్న సమస్యలు తీరతాయి. షూటింగ్ లు ప్రారంభం అయితే మొత్తం టాలీవుడ్ సమస్య తీరుతుంది. కానీ ఈ రెండూ జరగాలంటే ప్రభుత్వాల నుండి ఆదేశాలు రావాలి. అప్పుడే షూటింగ్స్ గాని సినిమా రిలీజులు గాని.

 

అయితే ఈ విషయంలో తాజాగా అందిన సమాచారం ప్రకారం జూలై నుంచి షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అంతేకాదు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని బట్టి, మే 3న లాక్ డౌన్ తొలగించిన 15 రోజుల తరువాతే థియేటర్లు, షూటింగ్ ల గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ అంటే వందల సంఖ్యలో జనాలు పాల్గొంటారు. అలాగే సినిమాలు రిలీజ్ అంటే కూడా జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండింటిలో ప్రభుత్వాలు అంత త్వరగా నిర్ణయం తీసుకోవడం లేదట. 

 

జూలై నుంచి షూటింగ్ లు ప్రారంభమైతే, ఆచార్య, వకీల్ సాబ్, రాజమౌళి ఆర్ఆర్ఆర్, బోయపాటి-బాలకృష్ణ లాంటి పెద్ద సినిమాలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి. ఈ సినిమాల తో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు పది నుంచి 15 వరకు వున్నాయి. ఈ సినిమాలు అన్నీ పూర్తి కావాలంటే కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు నిరవధికంగా పనులు సాగాలి. ఇక కొత్త ప్రాజెక్టుల గురించి ఇప్పట్లో ఆలోచించుకుంటే మంచిదని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ కి గడ్డుకాలమే అని మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: