పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఎన్నో సినిమాలలో , విభిన్న గెటప్ లలో నటించిన పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. 

 

 

 

 

అయితే పవన్ కళ్యాణ్ సినిమాలంటే జనాలకు పిచ్చి అన్న సంగతి తెలిసిందే...అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే..ఎలా రాజకీయాల్లో సక్సెస్ కాలేక పోయాడు.. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా  ఉన్నాడు..ఇకపోతే సినిమాలు చేయడమే కాదు సినిమాలలో ఒక యునిక్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయని ఫ్యాన్స్ ఆభిప్రాయ పడుతున్నారు..

 

 

 

 

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ వాయిదా పడింది..ఆ తర్వాత 25 రోజులపాటు చిత్రీకరణ జరిపితే, ఈ సినిమా షూటింగు పూర్తవుతుందని అంటున్నారు. 

 

 

 

 

అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో కోర్టు సెట్ వేశారట. మిగిలిన భాగంలో చాలా వరకూ ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఆ తరువాత ఒక పాటను చిత్రీకరిస్తారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: