త్రివిక్రమ్‌ శ్రీనివాస్ సినిమా అంటే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ ఏ హీరో సినిమా అనౌన్స్ చేసిన అంచనాలు మొదలైపోతాయి. ఇక త్రివిక్రమ్‌ అల్లు అర్జున్ తో గత సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో వసూళ్ళని రాబట్టి సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్ లోను ఈ సినిమా హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాదు అల్లు అర్జున్ టాప్ టెన్ లో నిలిచిన సినిమాగా కూడా స్థానాన్ని సంపాదించుకుంది. 

 

దాంతో తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు త్రివిక్రమ్‌. ఎన్.టి.ఆర్ 30 వ సినిమా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గాను అనౌన్స్ చేశారు. అంతేకాదు అయినను పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ పార్ట్ మే నెలలోగా అయిపోతుందని అనుకున్నారు. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా జూన్‌లోనే మొదలవుతుందని, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్న న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీటవడానికి టైమ్ పడుతుందని తెలుస్తుంది.

 

దాంతో త్రివిక్రమ్‌ తారక్ సినిమా లేటవడంతో ఈ గ్యాప్ లో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా రెడి అవుతుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే అందులో వాస్తవం లేదని క్లారిటి వచ్చేసింది. అంతేకాదు త్రివిక్రమ్‌ పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంటుందని ఆ తర్వాతే త్రివిక్రమ్‌ తారక్ సినిమా మొదలవుతుందని చెప్పుకున్నారు. అయితే ఇది కూడా పూర్తిగా పుకారే అని అర్థమవుతుంది. త్రివిక్రమ్‌ సినిమా తారక్ తోనే అని ఇందులో ఏమాత్రం మార్పు లేదని ఉండబోదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌ తారక్ సినిమా స్క్రిప్ట్ లో బిజీగా ఉన్నారట. ఆర్.ఆర్.ఆర్ లేటయినా వేయిట్ చేస్తారట త్రివిక్రమ్‌. తారక్ సినిమా తర్వాతే వేరే సినిమా అని దీన్ని బట్టి క్లారిటి వచ్చింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: