టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వాస్తవానికి గతంలో వచ్చిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు సక్సెస్ఫుల్ హిట్స్ కొట్టిన సూపర్ స్టార్, ఇప్పుడు సరిలేరు తో మరొక హిట్ కొట్టి, హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. ఇకపోతే తన తదుపరి సినిమాని అతి త్వరలో ప్రారంభించనున్న సూపర్ స్టార్, ఆ సినిమాని పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ, తన నెక్స్ట్ సినిమాని కేఎల్ నారాయణ నిర్మాతగా, దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఉంటుందని చెప్పడం జరిగింది. 

 

వాస్తవానికి ఈ ప్రాజక్ట్ ఎప్పుడో తెరకెక్కాల్సింది అని, అయితే ఎట్టకేలకు తన తదుపరి ఈ సినిమానే చేయనున్నట్లు నిన్న క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. అయితే అలా రాజమౌళి నుండి ప్రకటన రాగానే నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో మహేష్, రాజమౌళి సినిమా గురించిన న్యూస్ విపరీతంగా హోరెత్తాయి. అయితే ఈ సినిమాపై కొందరు మాత్రం కొద్దిపాటి అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో అది ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తారో తెలియని పరిస్థితని, అలానే ఆర్ఆర్ఆర్ అనుకున్న సమయానికి వస్తుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేను అని నిన్నటి ఇంటర్వ్యూ లో స్వయంగా రాజమౌళి చెప్పడంతో ఆ సినిమా తప్పకుండా సమ్మర్ కి వాయిదా పడుతుందని అంటున్నారు. ఇక అప్పటి వరకు మహేష్ సినిమా ఊసు ఉండకపోవచ్చని అంటున్నారు. 

 

అలానే తన ప్రతి సినిమా అనంతరం కొంత విరామం తీసుకునే అలవాటున్న రాజమౌళి, ఆ తరువాత సినిమా మొదలెట్టేసరికి ఖచ్చితంగా ఆరు నెలలకు పైగా పడుతుందని, అది కూడా ఈలోపు మహేష్ సినిమా తాలూకు పూర్తి కథ, స్క్రిప్ట్ సిద్ధం అయితేనే అని, ఇక ఆపై సరిగ్గా అదే సమయంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఆయన ఎవరితో చేస్తున్నారో, దానిని బట్టి వీరి సినిమా ఎప్పుడు మొదలెట్టాలో తేల్చుకోవాలని, దానితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఎటువంటి జానర్ లో మహేష్ తో రాజమౌళి సినిమా చేస్తారు అనేది అతి పెద్ద ప్రశ్న అని, తప్పకుండా ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది కాబట్టి దానికి బడ్జెట్ విషయమై కొంత ఆలోచన చేయాలని, ఎందుకంటే అప్పటికి ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ అయి రాజమౌళి రేంజ్ మరింతగా వృద్ధి చెందడం ఖాయం వంటి పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. కాబట్టి ఇదంతా తేలి వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మరొక రెండేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదని, మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలని అంటున్నారు......!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: