జబర్దస్త్. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో బుల్లితెర మీద పాపులారిటీ తెచ్చుకున్న భామ రష్మి గౌతమ్. కెరియర్ మొదట్లో సినిమాల్లో ప్రయత్నించినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయ్యింది. మంచి ఫామ్ లో ఉన్న టైం లో అనసూయ జబర్దస్త్ కు కొద్దిగా బ్రేక్ ఇవ్వడం ఆ గ్యాప్ లో రష్మీ సెటిల్ అవడం జరిగింది. అయితే రష్మి వల్ల కూడా షోకి మంచి రేటింగ్ వస్తుందని.. ఒక జబర్దస్త్ నే రెండుగా చేసి.. ఒకటి జబర్దస్త్ రెండోది ఎక్స్ ట్రా జబర్దస్త్ అని పెట్టారు. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ లో వన్ అండ్ ఓన్లీ యాంకర్ గా రష్మీ తన హవా కొనసాగిస్తుంది. 

 

తనకు తెలిసిన వచ్చి రాణి తెలుగులోనే ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా రష్మి ముందుంటుంది. తన మనసులోని మాటని చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడని ఈ అమ్మడు లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో ఎన్టీఆర్ తో ఒక డ్యాన్స్ నంబర్ చేయాలన్న కోరిక బయటపెట్టింది అమ్మడు. టాలీవుడ్ లో డ్యాన్స్ తో దుమ్మురేపే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అలంటి స్టార్ తో ఒక సాంగ్ లో అయినా డ్యాన్స్ చేయాలని అంటుంది రష్మి. రష్మీ కోరిక తీరానిదైతే కాదు కానీ ఎన్టీఆర్ పక్కన రష్మి ఛాన్స్ కొట్టేస్తుందా లేదా అన్నది చూడాలి. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ టైం లో కరోనా బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబుతున్న రష్మీ వీధి కుక్కలకు ఫుడ్ అందించి తన మంచి మనసుని చాటుకుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే వెండితెర మీద అందాల కనువిందు చేస్తున్న రష్మీ నిజంగా ఎన్టీఆర్ తో ఛాన్స్ వస్తే మాత్రం అమ్మడి క్రేజ్ డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: