తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలోనే అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టరే. ఒకదానిని మించి మరోటి.. హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ప్రతీ సినిమాకీ ఎంతో టైమ్ తీసుకునే జక్కన్న అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఏనాడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రం తెరకెక్కుతోంది.

 

 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ పై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఆర్.ఆర్.ఆర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వల్ల ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో సినిమా రంగానికీ తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

 

 

థియేటర్లు మూతబడి వాటి యాజమాన్యానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగులు లేకపోవడంతో రోజువారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో చిరంజీవి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కష్టాలను తీర్చడానికి కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించి కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నారు. అయితే ఈ ఛారిటీకి చాలా మంది సెలెబ్రిటీలు స్పందించారు.

 

 

ఆ విషయాలు సోషల్ మీడియాద్వారా జనాలకి తెలుస్తూనే ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది స్పందించారు రాజమౌళి కుటుంబం ఎందుకు స్పందించలేదు అన్న వార్త ఊపందుకుంది. అయితే దానికి రాజమౌళి వివరణ ఇస్తూ, ఏడాది పొడవునా మా కుటుంబంలోని వారు ఏదో సాయం చేస్తూనే ఉంటారని.. అయితే కొంతమంది మాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడతారు.. కొందరు ఇష్టపడరని.. చెప్పుకోవడం తప్పేం కాదని.. చెప్పుకోనంత మాత్రాన చేయనట్టు కాదని చెప్పుకొచ్చాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: