వచ్చేనెల మే 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు జరగబోతోంది. అప్పటికి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే లాక్ డౌన్ పిరియడ్ ముగిసిపోతుంది కాబట్టి తారక్ పుట్టినరోజునాడు విడుదల కాబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని  జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ వస్తుందని ఆ టీజర్ గురించి ఇప్పటి నుంచే తారక్ అభిమానులు కలలు కంటున్నారు. 


అయితే జూనియర్ అభిమానుల ఉత్సాహం పై ఊహించని విధంగా రాజమౌళి నీళ్ళు జల్లాడు. అయితే ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన కామెంట్స్ ను బట్టి వచ్చేనెల జూనియర్ కు సంబంధించిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీజర్ రాదు అంటూ వ్యూహాత్మకంగా రాజమౌళి జూనియర్ అభిమానులను ప్రిపేర్ చేయడానికి చేసిన కామెంట్స్ అతడి అభిమానులలో చిచ్చును రగిల్చాయి. 

 

చరణ్ బర్త్ డే సమయానికి లాక్ డౌన్ పిరియడ్ ఉన్నా అప్పటికే ఆ టీజర్ కు సంబంధించి తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడనీ అయితే మిగతా భాషల వాయిస్ ఓవర్ మాత్రం జూనియర్ ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో గా రికార్డ్ చేసామని అప్పటికే చరణ్ టీజర్ కు సంబంధించిన మెటీరియల్ అంతా రెడీగా ఉండటంతో పని సాఫీగా జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే జూనియర్ పుట్టినరోజునాడు విడుదల కాబోయే టీజర్ కు సంబంధించి మాత్రం తన దగ్గర ఎటువంటి మెటీరియల్ లేదని అది అంతా రెడీ అవ్వాలి అంటే ‘ఆర్ ఆర్ ఆర్’ ఆఫీసుకు వెళ్లి అక్కడ తన సిస్టమ్స్ ను ఓపెన్ చేసి సర్వర్ లో ఉన్న మెటీరియల్ ను రెడీ పెట్టాలి అంటూ తనకు ఉన్న సమస్యలను బయటపెట్టాడు.

 


అంతేకాదు ఈ టీజర్ రిలీజ్ చేయాలి అంటే కేవలం ఎడిటింగ్ గ్రాఫిక్ వర్క్ మాత్రమే పూర్తయితే చాలదని టీజర్ కు సంబంధించి కొంత షూటింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందనే విషయాన్ని నెమ్మదిగా బయటపెట్టి చివరి నిముషంలో తనకు జూనియర్ అభిమానుల నుంచి అసహనం ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి జూనియర్ టీజర్ విడుదల అవుతుందా లేదా అన్న విషయం కరోనా చేతిలోకి వెళ్ళి పోయింది. వచ్చేనెల పరిస్థితులు చక్కబడి షూటింగ్స్ కు ప్రభుత్వం పాక్షికంగానైనా అనుమతి ఇస్తే తప్ప జూనియర్ పుట్టినరోజునాడు ఈసినిమాకు సంబంధించి ఎటువంటి టీజర్ సందడి ఉండదు. నిన్నటి నుంచి లీక్ అయిన ఈ వార్తలతో ప్రస్తుతం జూనియర్ అభిమానులు చాల నిరాశలో ఉన్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: