దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఖాళీగా ఉన్న సమయాన్ని టీవీలు చూస్తూ.. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో మూవీస్.. వెబ్ సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ బాగా పెరిగిపోయింది. కొత్త కొత్త వెబ్ కంటెంట్ తో ముందుకు వస్తున్నారు ఓటీటీస్. అంతేకాకుండా కొత్త సినిమాలను అప్లోడ్ చేస్తూ ఈ కలిసి వచ్చిన సమయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా అన్ని సినిమాలను కొనుక్కొని ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు.

 

ఇప్పుడు తాజాగా ఇక్కడ డిజాస్టర్ గా మిగిలిన ఒక సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేస్తే ఏకంగా టాప్ టూ పొజిషన్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఆ సినిమా మన విజయ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్'. విజయ్ దేవరకొండ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ ఫార్మాట్ లో దుమ్మురేపుతోంది. ఏకంగా ఈ చిత్రం ఇండియా వైడ్ గా సెకండ్ పోజిషన్ లో ట్రెండ్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా రెండు రోజుల క్రితం ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి అంబాటులోకి తెచ్చింది. విశేష ఆదరణ దక్కించుకుంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తుంది.

 

మూవీ థియేటర్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తెలుగు మరియు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది. అలాంటిది డిజిటల్ ఫార్మాట్ లో ఇంతటి ఆదరణ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా థియేటర్స్ లో విఫలం చెంది, ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విజయం సాధించింది. సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని తెరకెక్కించగా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ హీరోయిన్లుగా నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: