కరోనా వల్ల థియేటర్లు బంద్ అయ్యాయి.కానీ జనాలు ఓటీటీల పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ల రేట్లు కామన్ ఆడియన్ కు భారంగా మారాయి.. దాంతో కరోనా ఎఫెక్ట్ తో టికెట్ రేట్లు పెరిగితే సామాన్యుడు థియేటర్ కు దూరం అయినట్టె. అదే అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఓటీటీలు.

 

ఈ మధ్యలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రభావం ఆడియన్స్ మీద ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో.. ఓటీటీల హడావిడి ఇంకా పెరిగిపోయింది.అందులోనూ ఆహా లాంటి కొత్త కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మార్కెట్ లోకి రావడంతో.. జనాలు ఇప్పుడు వాటిని ఎగబడి చూస్తున్నారు. అంతే కాదు లాక్ డౌన్ తో ఇంట్లో ఉన్న వారికోసం స్పెషల్ ప్యాక్ లు.. కొత్త కొత్త కంటెంట్ లో ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి ఓటీటీలు. లాక్ డౌన్ తరువాత కూడా ఇవి థియేటర్లకు శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది.

 

థియేటర్లకు వెళ్తే... టికెట్ కు చాలా రేటు పెట్టాలి. వైరస్ భయంతో అందులో కూర్చోవాలి. ఇంక ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడ ఉంటుంది. కాని ఒక్కరి టికెట్ రేట్ తో యాప్ లను యాక్టివేట్ చేసుకుని.. ఫ్యామిలీ అంతా చూసే అవకాశం ఉండటంతో ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేసుకుని తక్కువ రేట్ లో సినిమాలు ఇంట్లో ఉండే శ్రమలేకుండా అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఇంకా లాక్ డౌన్ ఇబ్బంది పడుతున్న ఎంటర్ టైన్మెంట్ ప్రియులకు ఈ యాప్ లు వరంగా మారాయి. ఇక ముందు కూడా వీటి ప్రభావం ఎక్కువగానే కనిపించే అవకాశం ఉంది.

 

ఆహా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ 5  లాంటి  వెల్ నోన్ యాప్స్ తో పాటు ఇంకొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో స్టార్ యాక్టర్స్ తో స్టార్ డైరెక్టర్లు చేస్తున్న రకరకాల వెబ్ సిరీస్ లు, వీటితో పాటు సీరియళ్లు.. ప్రోగ్రామ్స్.. గేమ్ షోలు సందడి చేస్తుండటంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ దూసుకుపోవడంతో మూవీ స్టార్స్ కూడా వీటిపైనే దృష్టిపెడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉండి ఓటీటీకి అలవాటు పడ్డ జనాలు దాని టేస్ట్ చూసి ఇప్పుడు థియేటర్స్‌కు వెళ్లగలరా.. ? అందులోను టికెట్ రేట్లు.. వైరస్ భయం ఓటీటీకి కలిసివచ్చే అంశం. అందుకే థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ .. ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యగలిగితే చాలు ..ఇక తర్వాత వాళ్లే అలవాటు పడిపోతారని స్కెచ్ లు వేస్తున్నాయి  ఓటీటీ నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: